Today Gold Price: నిలకడగా ఉన్న బంగారం ధరలు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..!

|

May 24, 2021 | 6:32 AM

Gold Rate Today: దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మే..

Today Gold Price: నిలకడగా ఉన్న బంగారం ధరలు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..!
Gold Price
Follow us on

Gold Rate Today: దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మే నెల నుంచి పరుగులు పెట్టింది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతూ వచ్చిన ధరలకు సోమవారం బ్రేక్ పడింది. దేశీయంగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే ఒక్క చెన్నైలో మాత్రం 10 గ్రాముల ధరపై 100 రూపాయలు పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,930 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,830కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,060 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,830 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది.

కాగా, బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ చదవండి:

Amazon Prime: అమెజాన్ కీలక నిర్ణయం.. రెండు గంటల్లో డెలివరీ ఇచ్చే ప్రైమ్ సర్వీసును నిలిపివేస్తున్నట్లు ప్రకటన..!

Health Insurance: ప్రీమియం రెన్యువల్‌ రేటు పెరిగిందా..? మీ పాలసీని వేరే సంస్థకు ఇలా బదిలీ​ చేసుకోండి