Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 23 ఒక్క రోజే బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. కానీ మిగతా రోజుల్లో ధర తగ్గడం లేదా స్థిరంగా...

Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

Updated on: Dec 27, 2021 | 6:43 AM

Gold Price Today: దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 23 ఒక్క రోజే బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. కానీ మిగతా రోజుల్లో ధర తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతుండడం కనిపించింది. తాజాగా మార్కెట్లో జరగుతోన్న పరిణామాలు, ఒమిక్రాన్‌ భయాందోళనలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం బంగారం ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు పెరిగి, రూ.47,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,810గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,310గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,660 ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,490 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో కూడా బంగారం ధర రూ. 10 పెరిగింది. ఇక్కడ నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,490గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,490గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,360 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,490గా ఉంది.

Also Read: Bigg Boss 5 Telugu Shanmukh: దీప్తి నన్ను బ్లాక్ చేసింది.. బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్..

Radhe Shyam: రాధేశ్యామ్‌ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కోసం రంగంలోకి..

Student Suicide: ఉద్యోగం వస్తుందో.. రాదోనని హాస్టల్‌ గదిలో విద్యార్థి ఆత్మహత్య..!