Ather 450: నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు

|

Jan 04, 2025 | 4:29 PM

భారతదేశంలో ఈవీ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్ల కొనుగోలుకు మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త అప్‌డేటెడ్ ఫీచర్స్‌తో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల అమ్మకాల్లో ఆదరణ పొందిన ఏథర్ తన 450 మోడల్ అప్‌డేటెడ్ వెర్షన్ స్కూటర్‌ను శనివారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Ather 450: నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
2025 Ather
Follow us on

భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ 2025 ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ బ్రాండ్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా సోషల్ మీడియాలో ప్రకటించారు. శనివారం జరగనున్న ట్రాక్ అటాక్ ఈవెంట్‌లో ఈ ఈవీ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో మొదటిసారిగా 2018లో విడుదల చేశారు. ఆ తర్వాత అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ స్కూటర్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నారు. అయితే తరుణ్ మెహతా 2025 ఏథర్ 450 సిరీస్ పొందబోయే అప్‌డేట్‌ల గురించి కీలక విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ స్కూటర్‌లో ‘మ్యాజిక్ ట్విస్ట్’ ఫీచర్‌ను జాబితాలో చేర్చింది. ఈ ఫీచర్ ఏథర్ 450 అపెక్స్‌లో ప్రవేశపెట్టారు. 

అలాగే ఏథర్ 450 అప్‌డేటెడ్ వెర్షన్‌లో బ్రేకింగ్ కోసం థొరెటల్ ట్విస్ట్‌ని కూడా ఉపయోగించింది. ఈ ఫీచర్‌ ద్వారా  వేగాన్ని సౌకర్యంగా నియంత్రించవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో ఏథర్ విడుదల చేసిన వీడియో ప్రకారం ఒక రేస్ ట్రాక్‌లో ఐసీఈ మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లతో పోటీపడుతున్న ఈవీ స్కూటర్‌ను వీడియోను షేర్ చేసింది.  ముఖ్యంగా పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ఈవీకు సంబంధించిన పవర్‌ట్రెయిన్‌లో మార్పులను సూచిస్తుంది. ముఖ్యంగా స్కూటర్ ఇంటీరియర్‌ ఫీచర్స్‌లో చాలా మార్పులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. 

యూజర్ల భద్రత కోసం అధునాతన ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా నయా ఏథర్ 450లో అందిస్తున్నారు. దీన్ని బ్రాండ్ స్కిడ్ కంట్రోల్ అని పిలుస్తున్న ప్రస్తుత ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ అని భావిస్తున్నారు. ఏథర్ స్టేక్-6 సాఫ్ట్‌వేర్‌తో ప్యాకేజీలో భాగమైన సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు ఉంటాయని నిపుణులు అంచనావ వేస్తున్నారు. అయితే ఇంత అప్‌డేటెడ్ ఫీచర్స్‌తో వస్తున్న ఏథర్ 450 ధర భారీగా పెరగుతుందని భావిస్తున్నారు.  ప్రస్తుతం, ఏథర్ 450 రూ. 1.15 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ప్రస్తుతం 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 3.7 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో ఆకట్టుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి