Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits Schemes: మంచి రాబడి అందించే మూడు అద్భుతమైన స్కీమ్స్‌

వయసు పెరిగే కొద్ది ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో ఎవ్వరిమీద ఆధారపడకుండా ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. వివిధ పథకాలలో..

Benefits Schemes: మంచి రాబడి అందించే మూడు అద్భుతమైన స్కీమ్స్‌
EPFO
Follow us
Subhash Goud

|

Updated on: Feb 14, 2023 | 7:02 AM

వయసు పెరిగే కొద్ది ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో ఎవ్వరిమీద ఆధారపడకుండా ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. వివిధ పథకాలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం వల్ల వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. 60 ఏళ్లు పైబడిన వారు మార్కెట్లో అనేక రకాల పొదుపు పథకాలు ఉన్నాయి. దీని ద్వారా మంచి రాబడి పొందవచ్చు. భారతదేశంలోని పొదుపు పథకాల ద్వారా సీనియర్ సిటిజన్లు అదనపు ప్రయోజనాలను పొందుతారు. వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకించి కొన్ని పొదుపు పథకాలు ప్రారంభించారు. అందులో 3 పథకాలు చాలా ముఖ్యమైనవి. అవేంటో తెలుసుకుందాం.

  1.  సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎప్‌సీఎస్‌ఎస్‌) సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఖాతాను తెరవవచ్చు. 55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు లేదా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, ఉద్యోగం నుంచి వీఆర్‌ఎస్‌ తీసుకున్నట్లయితే ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు.. ఉద్యోగ విరమణ ప్రయోజనాన్ని పొందిన నెలలోపు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ కింద ఒక ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ సేవింగ్స్‌ స్కీమ్‌పై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.4 శాతం. ఇందులో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు 1000 నుంచి 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు.ఆదాయపు పన్ను మినహాయింపు మెచ్యూరిటీ వ్యవధి ముగిసిన తర్వాత ఈ స్కీమ్‌ ఖాతాను మరో మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే డిపాజిటర్ అందుకున్న వడ్డీ మొత్తం ఏటా 50 వేల రూపాయలు ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయిస్తారు.
  2. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) కింద సీనియర్ సిటిజన్‌లు సాధారణ వడ్డీ కంటే కొంత ఎక్కువ మొత్తం వడ్డీ పొందుతారు. భద్రత పరంగా ఈ పథకం వృద్ధులకు మెరుగైన ఎంపిక. ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు వివిధ కాలపరిమితుల ప్రకారం నిర్ణయించారు. FD లపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు సంవత్సరానికి 6.20 శాతంగా ఉంది. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను విశ్లేషించడం ద్వారా మీరు ఉత్తమ ఎఫ్‌డీ ఎంపికను ఎంచుకోవచ్చు.
  3. ప్రధాన మంత్రి వయ వందన యోజన ప్రభుత్వం సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) ప్రారంభించింది. ఏదైనా సీనియర్ సిటిజన్ మార్చి31, 2023 వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది వృద్ధుల పెన్షన్ పథకం. దీని ఆపరేషన్ LIC తో కలిసి ఉంటుంది. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలు, దాని కాలపరిమితి 10 సంవత్సరాలు. తరువాత పెట్టుబడిదారుడు సజీవంగా ఉంటే పెట్టుబడి మొత్తం చివరి విడత పెన్షన్‌తో పాటు తిరిగి వస్తుంది. ఒక పెట్టుబడిదారుడు 10 సంవత్సరాలలో మరణిస్తే పెట్టుబడి డబ్బు నామినీకి వెళ్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడిపై 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ సంవత్సరం, ఏటా ఏ ప్రాతిపదికన అయినా పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి