Business Tips: పచ్చగడ్డి కాదు పసిడి పంట! ఈ గడ్డి మిమ్మల్ని రాత్రికి రాత్రే లక్షాధికారిని చేయగలదు.. ఈ పొలానికి కావాల్సింది ఇదే!

|

Feb 25, 2023 | 7:16 AM

ఈ రకం గడ్డిజాతి మొక్కలు ఒకసారి నాటితే ఐదేళ్ల వరకు తిరిగి చూడాల్సిన పనిలేదు. తొలి పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. ఒకసారి కోస్తే తిరిగి 45 రోజుల్లో మళ్లీ కోతకొస్తుంది. ఇలా ఐదేళ్ల పాటు రాబడిని అందిస్తోంది.

Business Tips: పచ్చగడ్డి కాదు పసిడి పంట! ఈ గడ్డి మిమ్మల్ని రాత్రికి రాత్రే లక్షాధికారిని చేయగలదు.. ఈ పొలానికి కావాల్సింది ఇదే!
Napier Grass Industry
Follow us on

పశుపోషణలో గడ్డి ప్రధాన అవసరం. పశువులు, దూడలు తినే గడ్డి సాధారణంగా తోటల్లో దొరుకుతుంది. కానీ పూర్తిగా ఆరోగ్యకరమైన, పోషకమైనది కాకపోతే, అది పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అయితే పశుగ్రాసాల ఉత్పత్తికి భూమి లభ్యత క్రమంగా తగ్గిపోతున్నందువల్ల అధిక దిగుబడి, పోషక విలువలు కలిగిన పశుగ్రాసాలను పశు పోషకులు తప్పనిస రిగా పెంచాల్సిన అవసరముంది. ఈ క్రమంలోనే రైతులు సూపర్‌ నేపియర్‌ గ్రాస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు… పశువులకు ఆహారంగా పనికి వచ్చే ఈ గడ్డి ఇప్పుడు రైతులకు సిరులు కురిపిస్తోంది. సరికొత్త ‘ఆహార వాణిజ్య’ పంటగా వ్యవసాయంలో కొత్తరూపుదిద్దుకుంది.

నేపియర్ గడ్డి అని పిలువబడే ఈ గడ్డి పశువులకు మంచి మేత. ఈ గడ్డి పశువులకు ఆరోగ్యకరమైనది, పోషకమైనది కూడాను. దీని వాడకం వల్ల పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ వ్యాపారం నుండి రైతులు మంచి లాభాలు గడిస్తున్నారు. నేపియర్‌ గడ్డిని 5 సంవత్సరాలకు ఒకసారి సాగు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది 5 సంవత్సరాలకు పంటను ఇస్తుంది. దీని సాగుకు బలమైన ఎక్కువగ ఎండా, వర్షపాతం అవసరం. జూన్, జూలైలో విత్తడం మంచిది. నేపియర్ గడ్డి పెంపకానికి లోతైన సాగు అవసరం. దీని సాగుకు ఎకరాకు 20 వేల విత్తనాలు అవసరం. మధ్యలో కలుపు తీయాలి. ఇది గడ్డిని బాగా వృద్ధి చేస్తుంది.

అచ్చం చెరుకుగడలా కనిపించే ఈ నేపియర్‌ గడ్డి థాయ్‌లాండ్‌ నుంచి వచ్చింది. భారత్‌ పరిస్థితులకు తగ్గట్టుగా హైబ్రిడ్‌ నేపియర్, సూపర్‌ నేపియర్, రెడ్‌ నేపియర్‌ గడ్డి రకాలు అభివృద్ధి చేశారు. పశుగ్రాసం కోసం పెంచే జొన్న, దుబ్బ వంటి గడ్డిజాతులు ఒకసారి నాటితే ఒకసారి మాత్రమే దిగుబడి ఇస్తాయి. ఏడాది తర్వాత మళ్లీ పెట్టుబడి పెట్టాల్సిందే. కానీ సూపర్‌ నేపియర్‌ గడ్డిజాతి మొక్కలు ఒకసారి నాటితే ఐదేళ్ల వరకు తిరిగి చూడాల్సిన పనిలేదు. తొలి పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. ఒకసారి కోస్తే తిరిగి 45 రోజుల్లో మళ్లీ కోతకొస్తుంది. ఇలా ఐదేళ్ల పాటు రాబడిని అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

నేపియర్ గడ్డి ఒక మొక్క 20 కిలోల గడ్డిని ఇస్తుంది. మీరు మార్కెట్‌లో 10 మొక్కలను విక్రయిస్తే , మీరు 2 లక్షల వరకు సంపాదించవచ్చు. మార్కెట్‌లో దీనికి చాలా డిమాండ్‌ ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..