Portable AC: అబ్బ.. ఎంత చల్లటి కబురు.! కూలర్ కంటే చౌకైన పోర్టబుల్ ఏసీ.. ఇప్పుడే కొనేయండి..
ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడి భగభగలను అటు జనాలు.. ఇటు విద్యార్ధులు తట్టుకోలేకపోతున్నారు. అసలే ఇది పరీక్షా సమయం కావడంతో విద్యార్ధులు తీవ్ర ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఏసీ కొనాలని ప్రయత్నిస్తుంటే.. కొంచెం ఆగండి.. మీకోసం కొన్ని షార్ట్ లిస్ట్ చేశాం.. ఎక్కడైనా పెట్టే.. ఎక్కడికైనా తీసుకెళ్లే.. ఓ మినీ పోర్టబుల్ ఏసీని మీ ముందు ఉంచాం.

బాబోయ్ ఎండలు.. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి బయటకు రావాలంటే చాలు.. జనాలు వణికిపోతున్నారు. సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక.. ఏసీలకు, ఫ్యాన్‌లను ఆశ్రయిస్తున్నారు. ఎండ వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు మనకు ఫ్యాన్ సరిపోదు. కచ్చితంగా ఏసీ ఉండాల్సిందే. అయితే మిడిల్ క్లాస్ వ్యక్తులు గోడ ఏసీ కొనాలంటే.. కొంచెం ఆలోచిస్తారు. ఇక అలాంటివారి కోసం పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లోకి బోలెడన్ని వచ్చేశాయ్. ఈ మినీ పోర్టబుల్ ఏసీలను మీరెక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆఫీస్ రూమ్, పిక్నిక్.. స్టడీ రూమ్.. ఇలా ఎక్కడైనా పెట్టొచ్చు. మరి లేట్ ఎందుకు మీకోసం తీసుకొచ్చిన ఓ పోర్టబుల్ ఏసీ గురించి చూసేయండి.. వాటి ధరలు, ఫీచర్లు ఏంటో తెలుసుకుందామా..!
ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ అమ్మకానికి అందుబాటులో ఉంది. వాస్తవానికి దీని ధర రూ. 2,999 కాగా.. 40 శాతం తగ్గింపుతో రూ. 1,799కి లభిస్తోంది. దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ. 88 కడితే చాలు.. మీ ఇంటికి మినీ ఏసీని తెచ్చుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీలోని కూలింగ్ ఫ్యాన్ స్పీడ్‌ను మూడు మోడ్స్‌లో అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ కూలర్ బరువు కూడా చాలా తక్కువ. అలాగే ఇందులోని వాటర్ ట్యాంక్‌లో ఒకసారి నీళ్లు నింపితే దాదాపుగా 4-5 గంటల వరకు ఉపయోగించవచ్చు. దీని నుంచి వచ్చే సౌండ్ వల్ల రాత్రి చాలా కూల్‌గా నిద్రపోవచ్చు. అలాగే ఇందులో 7 రంగుల ఎల్‌ఈడీ కలర్ ఆప్షన్ ఉంది. కాగా, ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆ సైట్, వస్తువుకు సంబంధించిన కండీషన్‌ను సరిగ్గా చూసి తీసుకోండి. పైన ఇచ్చినది కేవలం సమాచారం కోసమే.. ఇది గమనించగలరు. (Source)




