No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ మంచిదేనా? ఈ విషయాలు తెలుసుకోండి!

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లు చాలామంది నో కాస్ట్ ఈఎంఐ ద్వారా ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తుంటారు. నో కాస్ట్ ఈఎంఐ అంటే అందులో వడ్డీ ఉండదు. కాబట్టి బెస్ట్ ఆప్షన్ అనుకుంటారు. అయితే ఇందులో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయని మీకు తెలుసా? ఇంతకీ అవేంటంటే..

No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ మంచిదేనా? ఈ విషయాలు తెలుసుకోండి!
No Cost Emi

Updated on: Oct 02, 2025 | 2:19 PM

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లేదా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఏవైనా ప్రొడక్ట్స్ కొనేటప్పుడు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ చాలామంది కస్టమర్లను ఊరిస్తుంది. అదనపు వడ్డీ లేకుండా ఈఎంఐ ఆప్షన్ లో కొనుగోలు చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ దీంతో నిజంగా లాభమేనా? ఏవైనా నష్టాలు కూడా ఉన్నాయా? ఇప్పడు తెలుసుకుందాం.

హిడెన్ ఛార్జీలు

నో కాస్ట్ ఈఎంఐ అంటే ప్రొడక్ట్ కాస్ట్ ను కొన్ని నెలల వ్యవధిలో చెల్లించే విధానం. ఇందులో వడ్డీ ఉండదు. ఎన్ని నెలలు ఎంచుకుంటే అన్ని నెలల్లో మొత్తం ధరను కట్టాలి. ఉదాహరణకు మీరు రూ. 12 వేల ప్రొడక్ట్ ను నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసి మూడు నెలల వ్యవధిని ఎంచుకుంటే నెలకు రూ.4 వేల చొప్పున కడితే సరిపోతుంది. వడ్డీ ఉండదు. అయితే ఇంది మంచి ఆప్షన్ లాగానే కనిపిస్తుంది. కానీ, ఇందులో కూడా ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ వంటి హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తాయి కొన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు. మొదటి నెల ఈఎంఐలో ఆ ఛార్జీలు వేస్తాయి. కానీ, ఆ విషయాన్ని ముందే వెల్లడించవు. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చదువుకోవాల్సి ఉంటుంది.

డిస్కౌంట్ కట్

నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వస్తువులకు కొన్నిసార్లు డిస్కౌంట్ వర్తించదు. ప్రొడక్ట్ పై కొంత డిస్కౌంట్ ఉంటే.. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ సెలక్ట్ చేసుకోగానే ఆ డిస్కౌంట్ కట్ అయ్యి ఒరిజినల్ ధర చూపిస్తుంది. అంటే దీనివల్ల మీకు అదనంగా ప్రయోజనం ఏమీ లేనట్టే అనుకోవాలి. ఉదాహరణకు ఒక ప్రొడక్ట్ రూ.10 వేలు ఉంటే డిస్కౌంట్ లో అది రూ.8500 చూపిస్తుంది అనుకుందాం. కానీ, మీరు నో కాస్ట్ ఈఎంఐ సెలక్ట్ చేసుకుంటే మీరు రూ.10 వేలు కట్టాల్సి ఉంటుందన్న మాట.

ఎక్కువ ఈఎంఐ

ఇకపోతే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను ఎక్కువ నెలల పాటు పెట్టుకునే అవకాశం ఉండదు. సాధారణంగా ఈఎంఐలు 6, 12, 18, 24 ఇలా చాలా నెలల పాటు పెట్టుకోవచ్చు. కానీ, నోకాస్ట్ ఈఎంఐలో కేవలం 3 లేదా 6 నెలల వ్యవధి మాత్రమే ఉంటుంది. దాంతో మీరు ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కట్టకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. అలాగే సాధారణ కొనుగోళ్లలో లభించే రివార్డ్ పాయింట్లు నో కాస్ట్ ఈఎంఐలో ఇవ్వరు.

లాభాలు కూడా..

ఇకపోతే నో కాస్ట్ ఈఎంఐతో కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ డిస్కౌంట్ కూడా అప్లై అయితే లేదా ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేకపోతే ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. అలాగే మీరు త్వరగా ఈఎంఐ ఫినిష్ చేయాలి అనుకుంటే దానికి కూడా ఇదే మంచి ఆప్షన్.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి