Small Finance Banks: దేశంలో చాలా మంది డబ్బులు పొదుపు చేసేందుకు సేవింగ్ అకౌంట్ తీస్తారు. అయితే బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ కూడా లభిస్తుంది. పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి పలు బ్యాంకులు. కానీ కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మాత్రం పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు అధికంగా ఇస్తున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ఈ చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీరేట్లను అందిస్తున్నాయి. అలాంటి కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకుల గురించి తెలుసుకుందాం.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు:
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులోని సేవింగ్ ఖాతాలకు 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను తెరవడానికి సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ.2000 నుంచి రూ.5000 వరకు ఉండాల్సి ఉంటుంది.
ఈక్విటాస్ ఫైనాన్స్ బ్యాంకు:
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇందులో నెలవారీ బ్యాలెన్స్ 2,500 నుంచి రూ.10 వేల వరకు ఉండాలి.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు:
ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులోని పొదుపు ఖాతాపై 6.25 శాతం వరకు వడ్డీరేటును అందిస్తోంది. ఇందులో నెలవారీ బ్యాలెన్స్ రూ. 2000 ఉండాలి. అయితే ఈ జాబితాలో బీఎస్‌ఈ లిస్టెడ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పొదుపు ఖాతాలపై అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మళ్లీ వడ్డీ రేట్ల విషయంలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: