Upcoming IPOs: స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఈ వారంలో ఏకంగా 4 ఐపీఓలు..

|

Apr 29, 2024 | 4:23 PM

ప్రజలు కూడా మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. రిస్క్ ఉన్నా.. అత్యధిక రాబడి రావడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమైన ఈ కొత్త వారంలో మరిన్ని ప్రైవేటు కంపెనీలు ఐపీఓ ఆప్షన్ తెరవనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి మే 3వ తేదీ లోపు నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి.

Upcoming IPOs: స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఈ వారంలో ఏకంగా 4 ఐపీఓలు..
Ipo Stock
Follow us on

ఇటీవల కాలంలో ఐపీఓ ట్రెండ్ కొనసాగుతోంది. పలు ప్రైవేటు కంపెనీలు తమ షేర్లను పబ్లిక్ ఇష్యూకి ఇస్తున్నారు. తమ ఈక్విటీ క్యాపిటల్ ను పెంచుకునేందుకు కంపెనీలు ఈ తరహా విధానాన్ని అవలంభిస్తున్నాయి. ప్రజలు కూడా మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. రిస్క్ ఉన్నా.. అత్యధిక రాబడి రావడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమైన ఈ కొత్త వారంలో మరిన్ని ప్రైవేటు కంపెనీలు ఐపీఓ ఆప్షన్ తెరవనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి మే 3వ తేదీ లోపు నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. వాటిలో సాయి స్వామి మెటల్స్ అండ్ అల్లాయ్స్, యామ్కే ప్రోడక్ట్స్, స్టోరేజ్ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్ మంగళవారం అంటే ఏప్రిల్ 30న ప్రారంభం కానుండగా.. స్లోన్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీఓ మే 3వ తేదీన ప్రారంభం కానుంది. మీలో ఎవరైనా వాటిల్లో షేర్లు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే.. ఈ కథనం మీకు బాగా ఉపకరిస్తుంది. ఈ నాలుగు కంపెనీలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందిస్తున్నాం.

సాయి స్వామి మెటల్స్ అండ్ అల్లాయ్స్ ఐపీఓ..

సాయి స్వామి మెటల్స్ అండ్ అల్లాయ్స్ కు చెందిన ఐపీఓ ఏప్రిల్ 30న ప్రారంభమైన మే3న ముగుస్తుంది. ఈ ఐపీఓ మే8 తేదీన బీఎస్ఈ ఇండెక్స్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. రూ. 15కోట్ల విలువైన ఈ ఐపీఓలో ఒక్కో షేర్ విలువ రూ. 60గా ఉంది. కనీసం 2000 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గత శనివారం ఈ కంపెనీకి సంబంధించిన జీఎంపీ ఫ్లాట్ గా ఉంది. దీని ప్రకారం ఈ కంపెనీ ఒక్కో షేర్ విలువ రూ. 60గా ఉంటుంది.

యామ్కే ప్రోడక్ట్స్ ఐపీఓ..

యామ్కే ప్రోడక్ట్స్ ఐపీఓ ఏప్రిల్ 30న ప్రారంభమై మే 3న ముగుస్తుంది. ఈ కంపెనీ విలువ రూ. 12.61 కోట్లు కాగా.. ఒక్కో షేర్ విలువ రూ. 52నుంచి రూ. 55 వరకూ ఉంటుంది. ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ఇండెక్స్ లో మే8న ఈ కంపెనీ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో కూడా కనీసం 2000షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

స్టోరేజ్ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్ ఐపీఓ..

స్టోరేజ్ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్ ఐపీఓ ఏప్రిల్ 30 ప్రారంభమై మే 3తో ముగుస్తుంది. ఈ కంపెనీ క్యాపిటల్ విలువ రూ. 29.95కోట్లు. ఈ ఓపీఓలో ఒక్కో షేర్ విలువ రూ. 73 నుంచి రూ. 78 మధ్య ఉంటుంది. కనీసం 1,600షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గత శనివారం ఐపీఓ జీఎంపీ ఫ్లాట్ గా ఉండటంతో షేర్ లిస్టింగ్ ధర పై విధంగా ఉంది.

స్లోన్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీఓ..

స్లోన్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీఓ మే3న ప్రారంభమైన మే7వ తేదీన ముగుస్తుంది. ఈ కంపెనీ విలు 11.06కాగా ఐపీఓలో షేర్ ధర రూ. 79గా ఉంది. దీనిలో కనీసం 1600షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది మే10వ తేదీన ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ఇండెక్స్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..