HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్‌.. రాత్రి నుంచి సేవలు నిలిపివేత.. ఎప్పటి వరకు అంటే..

HDFC Bank: ఈ అంతరాయం సమయంలో మీ అన్ని లావాదేవీలకు PayZapp వాలెట్‌ని ఉపయోగించమని బ్యాంకు సిఫార్సు చేస్తోంది. తమ సేవలను మరింతగా మెరుగుపరచడానికి సర్వర్‌లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ విషయం బ్యాంకు తన వినియోగదారులకు మెయిల్‌ కూడా..

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్‌.. రాత్రి నుంచి సేవలు నిలిపివేత.. ఎప్పటి వరకు అంటే..

Updated on: Jul 24, 2025 | 8:39 PM

HDFC బ్యాంక్ ఖాతాదారులకు ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. బ్యాంకింగ్‌ సేవల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. జూలై 24వ తేదీన రాత్రి 10 గంటల నుంచి 25వ తేదీ తెల్లవారు జాము గంటల వరకు 6 గంటల పాటు బ్యాంకుకు సంబంధించిన సేవల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు బ్యాంకు సూచించింది. కస్టమర్లు కొన్ని గంటల పాటు లావాదేవీలలో సమస్యలను ఎదుర్కొంటారు. సిస్టమ్ నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యాప్‌లోని సేవలను అంతరాయం ఏర్పడనుంది.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ ఎంత అలసిపోయినా ఆ పని చేయందే నిద్రపోరట.. అంబానీ లైఫ్‌స్టైల్‌ గురించి మీకు తెలుసా?

అలాగే ఈ అంతరాయం సమయంలో మీ అన్ని లావాదేవీలకు PayZapp వాలెట్‌ని ఉపయోగించమని బ్యాంకు సిఫార్సు చేస్తోంది. తమ సేవలను మరింతగా మెరుగుపరచడానికి సర్వర్‌లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ విషయం బ్యాంకు తన వినియోగదారులకు మెయిల్‌ కూడా పంపినట్లు తెలిపింది. సేవలను మరింతగా మెరుగు పర్చేందుకు వినియోగదారులు సహకరించాలని బ్యాంకు కోరింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: రూ.6.29 లక్షలకే 7 సీటర్స్‌ కారు.. 6 ఎయిర్‌ బ్యాగ్స్‌.. చౌకైన కారు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి