Driving License: భారత డ్రైవింగ్ లైసెన్స్‌ను వేరే దేశాల్లో కూడా వాడొచ్చు.. అవేంటో తెల్సా.?

|

Feb 28, 2024 | 12:59 PM

బైక్ లేదా కారుతో మనం రోడ్డెక్కాలంటే.. కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఒకవేళ లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ పోలీస్‌కు పట్టుబడితే.. జరిమానా చెల్లించాల్సిందే. టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇండియాలో కచ్చితం.

Driving License: భారత డ్రైవింగ్ లైసెన్స్‌ను వేరే దేశాల్లో కూడా వాడొచ్చు.. అవేంటో తెల్సా.?
Indian Driving License
Follow us on

బైక్ లేదా కారుతో మనం రోడ్డెక్కాలంటే.. కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఒకవేళ లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ పోలీస్‌కు పట్టుబడితే.. జరిమానా చెల్లించాల్సిందే. టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇండియాలో కచ్చితం. అయితే ఒక్క మన దేశంలోనే కాదు.. విదేశాలలోనూ వాహనాలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. మరి ఇండియా నుంచి విదేశాలకు వెళ్లే చాలామంది భారతీయులు అక్కడ వాహనం నడిపితే.. భారత్‌లో అనుమతించిన డ్రైవింగ్ లైసెన్స్ పనికి వస్తుందా.? అనే ప్రశ్న మీకు తలెత్తవచ్చు. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే అనుమతించే కొన్ని దేశాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఏ దేశాల్లో చెల్లుబాటు అవుతుంది.?

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, స్వీడన్‌లలో మన భారత డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగం, విద్య లేదా పర్యాటక వీసాపై మీరు ఆయా దేశాలకు వెళ్లినట్లయితే.. అక్కడ మన లైసెన్స్‌తో మీరు డ్రైవింగ్ చేయవచ్చు. అయితే ఆ లైసెన్స్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉండాలి. భారతదేశంలోని ఏ ప్రాంతీయ భాషలోనైనా డ్రైవింగ్ లైసెన్స్ ముద్రించి ఉంటే.. అది విదేశాల్లో చెల్లుబాటు అవ్వదు.

లైసెన్స్‌తో పాటు ఈ డాక్యుమెంట్స్ కూడా అవసరం..

భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాలలో వాహనాన్ని నడపడానికి, మీకు వివిధ దేశాలలో వేర్వేరు డాక్యుమెంట్స్ అవసరం. అమెరికాలో I-94 ఫారమ్ తప్పనిసరి. అలాగే ఇంకొన్ని దేశాల్లో భారత్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పర్మిట్ కూడా ఉండాలి. తద్వారానే మీరు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో విదేశాలలో డ్రైవ్ చేయవచ్చు.

ఇది చదవండి: అరగంటలోనే ఫుల్ ఛార్జ్.! ఏకంగా 570 కిలోమీటర్ల రేంజ్.. దెబ్బకు టెస్లా కారు తోక ముడుచుకోవాల్సిందే..