Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును పెంచడంతో.. దాని ప్రభావం వినియోగదారుల పడటం మెుదలైంది. ఆర్బీఐ అకస్మాత్తుగా గత వారం రెపో రేటు పెంపు నిర్ణయంతో ఇప్పటి వరకు 9 బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. ఈ కారణంగా పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ తో పాటు రెపోరేటుతో అనుసంభానమైన అనేక రకాల రుణాల రేట్లు భారీగానే పెరిగాయి. గత కొంత కాలంగా పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణాన్ని(INFLATION) కట్టడి చేయంటంలో భాగంగా రిజర్వు బ్యాంక్ ఈ మేరకు తాజాగా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచిన వాటిలో.. ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఇప్పటికే లోన్స్ తీసుకున్నవారి ఈఎంఐలు పెరగటంతో పాటు.. కొత్తగా పొందుతున్న రుణాలు సైతం కస్టమర్లకు ఖరీదుగా మారనున్నాయి.
ICICI BANK: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం వడ్డీ రేట్లను పెంచడంలో ముందు వరుసలో నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించిన రోజే బ్యాంక్ తన వడ్డీరేటును సవరించింది. పెరిగిన వడ్డీ రేట్లు మే 4 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బ్యాంక్ ఇప్పుడు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 8.10 శాతానికి పెంచింది. మరో పక్క ఐసీఐసీఐ తన ఎఫ్‌డీ రేట్లను మే 5 నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
PUNJAB NATIONAL BANK: పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపో రేటుతో అనుసంధానమైన తన రుణ రేట్లను (RLLR) 0.40 శాతం మేర పెంచింది. మే 7 నుంచి కొత్త కస్టమర్లకు వడ్డీ రేట్లను బ్యాంక్ పెంచింది. కానీ.. పాత కస్టమర్లకు పెరిగిన వడ్డీ రేట్లు జూన్ 1 నుంచి వర్తిస్తాయని వెల్లడించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటును 6.50 శాతం నుంచి 6.90 శాతానికి పెంచింది.
BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో-లింక్డ్ లెండింగ్ రేట్ ఆధారిత రుణాల వడ్డీ రేట్లను మే 5 నుంచి అమలులోకి తెచ్చింది. రిటైల్ రుణాల కోసం BRLLR రేటు ఇప్పుడు 6.90 శాతానికి పెరిగినట్లు బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
HDFC BANK: దేశంలోనే అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ HDFC, HDFC Bank విలీనం గురించి ఈ మధ్య కంపెనీ వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్స్ కోసం రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచింది. రుణాల రేటు 0.30 శాతం మేర పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు మే 9 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
INDIAN BANK: రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాల వడ్డీ రేట్లను సవరించినట్లు ఇండియన్ బ్యాంక్ శనివారం తెలిపింది. అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను 4 శాతం నుంచి 4.40 శాతానికి పెంచినట్లు బ్యాంక్ వెల్లడించింది. కొత్త కస్టమర్లకు పెరిగిన వడ్డీ రేట్లు మే 9 నుంచి వర్తిస్తాయని.. ఇదే సమయంలో పాత కస్టమర్లు జూన్ 1 నుంచి ఈ రేట్లు అమలవుతాయని స్పష్టం చేసింది.
KOTAK MAHINDRA BANK: ప్రైవేట్ రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ FDలపై చెల్లిస్తున్న వడ్డీ రేట్లను పెంచింది. 2 కోట్ల లోపు అన్ని డిపాజిట్లపై పెరిగిన వడ్డీ ప్రయోజనం అందుబాటులో ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది. పెరిగిన వడ్డీ రేట్లు మే 6 నుంచి అమల్లోకి వచ్చాయి. అత్యంత ప్రజాదరణ పొందిన 390 రోజుల డిపాజిట్‌పై వడ్డీ రేటును 0.30 శాతం నుంచి 5.5 శాతానికి పెంచినట్లు బ్యాంక్ తెలిపింది. అదే విధంగా 23 నెలల డిపాజిట్లపై వడ్డీ రేటు 0.35 శాతం పెంచటంతో 5.6 శాతానికి చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Steel Prices: గృహ నిర్మాణదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న స్టీల్ ధరలు..
Stock Market: వడ్డీ రేట్ల షాక్ నుంచి తేరుకుంటున్న మార్కెట్లు.. వరుస నష్టాలకు బ్రేక్..