Loan Rates: తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ పొందడం ఎలా? ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ!

|

Feb 10, 2024 | 4:14 PM

చాలా అత్యవసరంగా చిన్న లోన్ అవసరమయ్యే వ్యక్తుల కోసం పర్సనల్ లోన్ చాలా ముఖ్యమైన ఎంపికలలో ఒకటి. మీరు తాకట్టు పెట్టడానికి బంగారం లేకుంటే, వ్యక్తిగత రుణం ఒక అనివార్యమైన ఆప్షన్‌. తనఖా లేదా సెక్యూర్డ్ లోన్ మొదలైన వాటితో పోలిస్తే పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. తాకట్టు లేకుండా వ్యక్తిగత రుణం ఇవ్వబడినందున వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణానికి ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును కలిగి ఉన్నాయి..

Loan Rates: తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ పొందడం ఎలా? ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ!
Bank Loan
Follow us on

చాలా అత్యవసరంగా చిన్న లోన్ అవసరమయ్యే వ్యక్తుల కోసం పర్సనల్ లోన్ చాలా ముఖ్యమైన ఎంపికలలో ఒకటి. మీరు తాకట్టు పెట్టడానికి బంగారం లేకుంటే, వ్యక్తిగత రుణం ఒక అనివార్యమైన ఆప్షన్‌. తనఖా లేదా సెక్యూర్డ్ లోన్ మొదలైన వాటితో పోలిస్తే పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. తాకట్టు లేకుండా వ్యక్తిగత రుణం ఇవ్వబడినందున వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణానికి ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును కలిగి ఉన్నాయి. ఈ లోన్‌కు ఏ పత్రాలు అవసరం, కనీస వడ్డీకి రుణం పొందడానికి ఏమి చేయాలి? అనే వివరాలు తెలుసుకుందాం.

అతి తక్కువ రేట్లకే వ్యక్తిగత రుణాలు అందించే బ్యాంకులు:

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు: వడ్డీ రేటు 10.75 నుండి 24 శాతం వరకు
  • ఐసీఐసీఐ: బ్యాంక్: 10.65 శాతం నుంచి 16 శాతం వరకు
  • ఎస్‌బీఐ: 11.15 శాతం నుంచి 11.90 శాతం వరకు
  • కోటక్ మహీంద్రా: 10.99 శాతం
  • యాక్సిస్ బ్యాంక్: 10.65 శాతం నుండి 22 శాతం వరకు
  • ఇండస్ఇండ్ బ్యాంక్: 10.25 శాతం నుంచి 26 శాతం
  • బ్యాంక్ ఆఫ్ బరోడా: 11.40 నుండి 18.75 శాతం వరకు
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్: 11.40 నుండి 12.75 శాతం వరకు
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 11.35 శాతం నుంచి 15.45 శాతం వరకు
  • ఐడీబీఐ బ్యాంక్: 10.50 శాతం నుంచి 13.25 శాతం వరకు

కనీస వడ్డీ రేటుకు రుణం పొందాలంటే ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి

వ్యక్తిగత రుణం భద్రత లేని రుణం కాబట్టి, బ్యాంకులకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులు ఖాతాదారుడి నమ్మకం ఆధారంగా అంచనా వేసి రుణాలు ఇస్తాయి. అదేవిధంగా వారు అధిక వడ్డీ రేటును వసూలు చేస్తారు. ఎక్కువ వడ్డీ రేటు, కస్టమర్ రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఖాతాదారుని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బ్యాంకులు తెలుసుకోవడానికి క్రెడిట్ స్కోర్ అత్యంత ముఖ్యమైన సాధనం. కస్టమర్ వ్యక్తిగత రుణం మాత్రమే కాకుండా ఏదైనా రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకు ముందుగా వారి క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంది. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ తక్కువ వడ్డీ రేటుతో రుణం అందిస్తాయి బ్యాంకులు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణానికి వడ్డీ రేటు ఎక్కువ ఉంటుందని గుర్తించుకోండి.

పర్సనల్ లోన్ కోసం ఏ డాక్యుమెంట్లు అవసరం?

  • జీతం ఉంటే మునుపటి మూడు నెలల జీతం స్లిప్ అవసరం.
  • మునుపటి మూడు నెలలు లేదా ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్

అదనంగా బ్యాంక్ మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ నివేదికను తనిఖీ చేస్తుంది. మీకు క్రమశిక్షణ, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటే తక్కువ వడ్డీ రేటుతో మీకు పెద్ద మొత్తంలో రుణం ఇవ్వడానికి బ్యాంకు సిద్ధంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి