Credit Card: క్రెడిట్ కార్డుతో డబ్బు విత్ డ్రా చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి..

|

Aug 07, 2023 | 4:13 PM

ఏటీఎం మెషీన్ లో డెబిట్ కార్డును వినియోగించినట్లు క్రెడిట్ కార్డును వాడవచ్చు. కార్డు పెట్టి, పిన్ ఎంటర్ చేస్తే మనం నగదు తీసుకోవచ్చు. ప్రతి బ్యాంకు క్రెడిట్ కార్డులపై కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకొనే వెసులుబాటును అందిస్తుంది. ఆయా బ్యాంకు నిబంధనలను బట్టి 20 నుంచి 40శాతం వరకూ నగదు రూపంలో విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి.

Credit Card: క్రెడిట్ కార్డుతో డబ్బు విత్ డ్రా చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి..
Credit Card
Follow us on

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు చాలా కొద్ది మంది వద్దే ఉండే ఈ కార్డులు ఇప్పుడు బ్యాంకు నిబంధనలు సడలించిన కారణంగా తక్కువ జీతం ఉన్న వ్యక్తులకు వస్తున్నాయి. దీంతో అందరూ క్రెడిట్ కార్డులను విరివిగా వినియోగిస్తున్నారు. వాస్తవంగా క్రెడిట్ కార్డుతో వస్తువులను కొనుగోలు చేయొచ్చు. లేదా ఆన్ లైన్ షాపింగ్ చేయొచ్చు. లేదా ఈ పోస్ మిషన్ లో స్వైప్ చేయొచ్చు. ఎక్కువ మంది ఈ పద్ధతుల ద్వారానే క్రెడిట్ కార్డులను వినియోగిస్తారు. ఇలా వాడితేనే క్రెడిట్ కార్డు ప్రయోజనకరంగా ఉంటుంది. బిల్లు సమయానికి చెల్లించేస్తే ఎటువంటి వడ్డీ పడదు. కానీ మరో ఆప్షన్ క్రెడిట్ కార్డులో ఉంటుంది. అదే క్యాష్ విత్ డ్రా. ఏదైనా ఏటీఎంలో క్రెడిట్ కార్డుతో నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా నగదు విత్ డ్రా చేసుకునే మందు మీరు కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా నగదు విత్ డ్రా కి కొన్ని నిబంధనలు, చార్జీలు ఉంటాయి. అవి తప్పనిసరిగా తెలుసుకోవాలి.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

నగదు విత్ డ్రా ఎలా..

ఏటీఎం మెషీన్ లో డెబిట్ కార్డును వినియోగించినట్లు క్రెడిట్ కార్డును వాడవచ్చు. కార్డు పెట్టి, పిన్ ఎంటర్ చేస్తే మనం నగదు తీసుకోవచ్చు. ప్రతి బ్యాంకు క్రెడిట్ కార్డులపై కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకొనే వెసులుబాటును అందిస్తుంది. ఆయా బ్యాంకు నిబంధనలను బట్టి 20 నుంచి 40శాతం వరకూ నగదు రూపంలో విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. ఉదాహరణ చూస్తే మీ క్రెడిట్ కార్డుపై లిమిట్ రూ. 5లక్షలు ఉందనుకోండి.. మీరు రూ. 1లక్ష నుంచి రెండు లక్షల వరకూ నగదు విత్ డ్రా చేసుకొనేందుకు బ్యాంకు అనుమతి ఇస్తుంది.

చార్జీలు ఎలా ఉంటాయంటే..

అయితే క్రెడిట్ కార్డుపై నగదు విత్ డ్రా చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇది. మీరు చేసే ప్రతి విత్ డ్రాపై బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. మీరు విత్ డ్రా చేస్తున్న మొత్తంపై 2.5శాతం నుంచి 3 శాతం వరకూ ఫీజుగా తీసుకుంటాయి. ఇది బ్యాంకుల బట్టి మారుతుంటుంది. మీరు ఒక వేళ రూ. లక్ష విత్ డ్రా చేసారనుకోండి రూ. 2000 నుంచి రూ. 3000 వరకూ చార్జీని బ్యాంకులు వసూలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

అధికంగా వడ్డీ..

వాస్తవానికి క్రెడిట్ కార్డు అంటేనే వడ్డీ రహిత నగదుకు ప్రసిద్ధి. నిర్ణీత సమయానికి ఎటువంటి వడ్డీ లేకుండా మన అవసరాలకు వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుంది. కానీ మీరు ఏటీఎంలో క్రెడిట్ కార్డు ద్వారా విత్ డ్రా చేస్తే మాత్రం ఆ నగదుపై వడ్డీ పడుతుంది. విత్ డ్రా చేసిన మొదటి రోజు నుంచి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే వరకూ మీరు తీసుకున్న మొత్తంపై వడ్డీ పడుతుంది. ఈ రేటు బ్యాంకును బట్టి మారుతుంటుంది. ఈ చార్జీలు ఏడాదికి 30 నుంచి 40శాతం వరకూ కూడా ఉంటాయి.

క్రెడిట్ స్కోర్ పై ప్రభావం..

ఏటీఎంలో క్రెడిట్ కార్డు ద్వారా నగదు విత్ డ్రా చేస్తే అది విత్ డ్రా క్రెడిట్ గా బ్యాంకులు పరిగణిస్తాయి. దీంతో క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరిగి దీని ప్రభావం క్రెడిట్ స్కోరుపై పడుతుంది. సమయానికి బాకీ చెల్లించకపోతే ఆలస్య రుసుంతో పాటు క్రెడిట్ స్కోర్ బాగా దెబ్బతింటుంది.

అత్యవసరం అయితేనే చేయండి..

మీరు వీలైనంత వరకూ క్రెడిట్ కార్డు తో నగదు విత్ డ్రాను చేయకపోవడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో… ఇక వేరే ఆప్షన్ లేదు అనుకున్న సమయంలోనే క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎంలలో నగదును విత్ డ్రా చేసుకోవాలి. బకాయిలను గడువులోపు తప్పనిసరిగా చెల్లించాలి.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..