Top Companies India: ఇండియాలో ఇవే తోపు.. టాప్ 10 కంపెనీల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

అత్యంత వేగంగా భారత ఆర్ధిక వ్యవస్థ బలపడుతోంది. దీనికి కంపెనీలన్నీ సహాయపడుతున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ పెరగడంలో టాప్ కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దేశంలో టాప్ 10 కంపెనీలు ఏవో మీకు తెలుసా..?

Top Companies India: ఇండియాలో ఇవే తోపు.. టాప్ 10 కంపెనీల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
India Compnies

Updated on: Dec 11, 2025 | 3:05 PM

Top 10 companies: భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా దేశ జీడీపీ కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలలో అతి పెద్ద కంపెనీలు కీలక పాత్ర పోషిస్తాయి. టెక్నాలజీ, బ్యాంకింగ్, ఆయిల్, రిటైర్, ఆటోమొబైల్ వంటి రంగాల పాత్ర ప్రధానంగా ఉంటుంది. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్‌లో టాప్ 10 పెద్ద కంపెనీలు ఏవో మీకు తెలుసా..? 2025 మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం భారత్‌లో టాప్ 10 కంపెనీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టాప్‌లో రిలయన్స్

2025 మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్‌లో తొలి స్థానంలో కొనసాగుతోంది. దీని విలువ ప్రస్తుతం రూ.20.774 లక్షల కోట్లుగా ఉంది. ఇక మార్కెట్ విలువలో రూ.21 లక్షల కోట్లు దాటిన తొలి ఇండియన్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. ఇక మార్కెట్ వాల్యూ ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండో స్థానంలో కొనసాగుతోంది. దీని విలువ రూ.16.232 లక్షల కోట్లుగా ఉంది. డిసెంబర్ నాటికి ఈ బ్యాంక్ ప్రపంచంలోనే 13వ అతిపెద్ద సంస్థగా ఉంది. ఇక ఇండియాలో మార్కెట్ విలువ ప్రకారం అదిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీనే అని చెప్పవచ్చు. ఇక మూడో స్థానంలో భారతీ ఎయిర్‌టెల్ రూ.12,478 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉండగా. టీసీఎస్ రూ.11,509 కోట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

ఎస్బీఐ ఎన్ని స్థానంలో ఉందంటే..?

ఇక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రూ.9,798 లక్షల కోట్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.8,876 లక్షల కోట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఏడో స్థానంలో ఇన్పోసిస్(6,570 లక్షల కోట్లు), ఎనిమిదో స్థానంలో బజాజ్ ఫైనాన్స్ (6,338 లక్షల కోట్లు), తొమ్మిదో స్థానంలో లార్సెన్ అండ్ టూబ్రో (5,511 లక్షల కోట్లు), పదో స్థానంలో లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (5,426 లక్షల కోట్లు) ఉన్నాయి.

మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే..?

స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ విలువ మొత్తాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న కంపెనీ షేర్ ధరను మొత్తం బకాయి షేర్ల సంఖ్యతో లెక్కించడం వల్ల అది వస్తుంది. అధిక మార్కెట్ విలువ ఉన్న కంపెనీని పెట్టుబడిదారులు ఇష్టపడతారు.