Indian Car Sales: హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న కార్లు.. భారత్‌లో టాప్ 10 కార్లు..

అక్టోబర్‌లో మన దేశంలో కార్ల విక్రయాలు ఆమాంతం పెరిగాయి. జీఎస్టీ తగ్గింపు, పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. గత నెలలో భారత్‌లో అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

Indian Car Sales: హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న కార్లు.. భారత్‌లో టాప్ 10 కార్లు..
Top 10 Cars

Updated on: Nov 20, 2025 | 1:26 PM

Top 10 Selling Cars: బైక్‌లు, కార్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో వీటి విక్రయాలు గతంలో పోలిస్తే గణంగా పెరిగాయి. సెప్టెంబర్ 22 నుంచి కేంద్రం జీఎస్టీ రేట్ల తగ్గింపు అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత దసరా, దీపావళి పండుగల సీజన్ కూడా రావడంతో వాహనాల కొనుగోళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా SUV వెహికల్స్ అమ్మకాలు భారీగా ఊపందుకున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ నెలలో భారీగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అక్టోబర్‌లో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడుపోయి తొలి స్థానంలో నిలిచింది. గత నెలలో ఏకంగా 22,089 యూనిట్ల టాటా నెక్సాన్ అమ్మకాలు జరిగాయి. ఇక రెండో స్థానంలో 20,791 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ డిజైర్ ఉండగా.. మూడో స్థానంలో మారుతీ సుజుకీ ఎర్టిగా(20,087 యూనిట్ల)తో ఉంది. అటు 18,970 యూనిట్ల అమ్మకాలతో వాగనార్ నాలుగో స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే వాగనార్ అమ్మకాలు ఈ సారి దాదాపు 36 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా (18,381 యూనిట్ల)తో ఐదో స్థానంలో నిలవగా.. ఆరో స్థానంలో మహీంద్రా స్కార్పియో (17,880 యూనిట్లు) ఉంది.

మారుతీ ఫ్రాంక్స్ 17,003 యూనిట్ల అమ్మకాలతో ఏడో స్ధానంలో ఉండగా.. బాలెనో 6,873 యూనిట్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ఇక టాటా పంచ్ 16,810 యూనిట్లతో 9వ స్థానంలో ఉండగా.. మారుతీ స్విఫ్ట్ 15,542 యూనిట్లతో పదో స్థానంలో ఉంది. ఈ నెలలో కూడా కార్ల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..