AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌, విజయవాడలో తులం ఎంతుందంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.. ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు.. ఆ తర్వాత 10 వేల వరకు తగ్గాయి.. ఈ క్రమంలోనే.. మళ్లీ తగ్గినట్లే తగ్గి.. పెరిగాయి.. అయితే.. వారం నుంచి అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో.. దేశీయంగా కూడా గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి..

Gold Rate Today: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌, విజయవాడలో తులం ఎంతుందంటే..
Shaik Madar Saheb
|

Updated on: Nov 20, 2025 | 11:19 AM

Share

భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.. ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు.. ఆ తర్వాత 10 వేల వరకు తగ్గాయి.. ఈ క్రమంలోనే.. మళ్లీ తగ్గినట్లే తగ్గి.. పెరిగాయి.. అయితే.. వారం నుంచి అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో.. దేశీయంగా కూడా గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి.. గత వారం రోజుల్లోనే.. బంగారం పది గ్రాములపై రూ.5 వేల వరకు ధర తగ్గింది.. బుధవారం పెరిగిన బంగారం, వెండి ధరలు.. గురువారం తగ్గాయి.. బంగారం 10 గ్రాములపై రూ.170 వరకు తగ్గగా.. వెండి కిలోపై రూ.3వేల వరకు ధర తగ్గింది. అయితే.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు..

పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. గురువారం (నవంబర్ 20 2025) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.170 మేర ధర తగ్గి రూ.1,24,690 గా ఉంది.

22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.150 మేర ధర తగ్గి రూ.1,14,300 గా ఉంది.

వెండి కిలోపై రూ.5వేల మేర ధర తగ్గి రూ.1,65,000 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,690 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,14,300 ఉంది.. కిలో వెండి ధర రూ.1,73,000 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,24,690, 22 క్యారెట్ల ధర రూ.1,14,300 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,73,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,24,840 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,14,450 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,65,000 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,24,690 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,14,300 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,65,000 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,25,460 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,15,000 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,73,000 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..