Two Wheeler Insurance: మీ బైక్ ఇన్సురెన్స్ ఏది తీసుకోవాలి? తెలియాలంటే ఈ లెక్క చూడాల్సిందే..

బైక్ కు బీమా ఎలా చేయించుకోవాలి? ఆ సమయంలో ఏఏ అంశాలను పరిశీలించాలనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు. ప్రస్తుతం అనేక బీమా పాలసీలను ఆన్ లైన్ లో తీసుకోవచ్చు. అలాగే బీమా కాలిక్యులేటర్ ను ఉపయోగించి మెరుగైన పాలసీ తీసుకునే వీలు కూడా ఉంది. మోటార్‌సైకిల్ రకం, ఇంజిన్ క్యూబిక్ కెపాసిటీ, బీమా చేసిన డిక్లేర్డ్ విలువ, ఎంచుకున్న యాడ్ ఆన్ కవర్లు, పాలసీ కవరేజ్ పరిధి తదితర అంశాలపై బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుంది.

Two Wheeler Insurance: మీ బైక్ ఇన్సురెన్స్ ఏది తీసుకోవాలి? తెలియాలంటే ఈ లెక్క చూడాల్సిందే..
Bike Insurance

Updated on: Jun 12, 2024 | 4:54 PM

ద్విచక్ర వాహనం అనేది నేడు ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరంగా మారింది. సామాన్య, మధ్యతరగతి ప్రజల ముఖ్యమైన రవాణా సాధనం కూడా ఇదే. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయడంతో పాటు దాని నిర్వహణ సక్రమంగా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా బండికి బీమా తప్పనిసరిగా తీసుకోవాలి. దాని వల్ల మీకు అత్యవసర సమయంలో భద్రత లభిస్తుంది. వాహనానికి ప్రమాదం జరిగినా, ఎవరైనా దొంగిలించినా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు.

చాలా సులభం..

బైక్ కు బీమా ఎలా చేయించుకోవాలి? ఆ సమయంలో ఏఏ అంశాలను పరిశీలించాలనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు. ప్రస్తుతం అనేక బీమా పాలసీలను ఆన్ లైన్ లో తీసుకోవచ్చు. అలాగే బీమా కాలిక్యులేటర్ ను ఉపయోగించి మెరుగైన పాలసీ తీసుకునే వీలు కూడా ఉంది. మోటార్‌సైకిల్ రకం, ఇంజిన్ క్యూబిక్ కెపాసిటీ, బీమా చేసిన డిక్లేర్డ్ విలువ, ఎంచుకున్న యాడ్ ఆన్ కవర్లు, పాలసీ కవరేజ్ పరిధి తదితర అంశాలపై బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుంది.

బైక్ బీమా ప్రీమియం..

డ్యాక్యుమెంట్ లో తెలిపిన కవరేజీని పొందేందుకు పాలసీదారు చెల్లించాల్సిన మొత్తాన్ని బీమా ప్రీమియం అంటారు. బైక్ డ్యామేజ్ కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టాల కోసం బీమా దారుడిని కంపెనీ రీయింబర్స్ చేసే మొత్తాన్ని అది సూచిస్తుంది. బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ప్రీమియం అత్యంత ముఖ్యమైనది. బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోట్‌లను ఆన్‌లైన్‌లో కూడా పొందవచ్చు. ఇందుకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు తెలియజేస్తున్నాం.

అనువైన బీమా ప్లాన్..

మీ ద్విచక్ర వాహనానికి అనువైన బీమా ప్లాన్ ఎంచుకోవడంతో పాటు ప్రీమియం రేటు తక్కువగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. మీ బండి మోడల్, సంవత్సరం తదితర వివరాలను ఎంటర్ చేసిన తర్వాత బీమా సంస్థలు మీకు వివిధ పాలసీలను తెలియజేస్తాయి. వాటిలో మీకు అనువైన పాలసీని ఎంపిక చేసుకోవాలి.

సరైన సమాచారం..

మీ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్, మోడల్, తయారీ సంవత్సరం, ఓడోమీటర్ రీడింగ్ తదితర వాటిపై సరైన సమాచారాన్ని అందించాలి. తప్పుడు సమాచారం ఇస్తే భవిష్యత్తులో క్లెయిమ్‌ చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.

కవరేజ్ రకం..

ఆన్‌లైన్‌లో మీకు అందుబాటులో ఉన్న బైక్ ఇన్సూరెన్స్ లలో మీ అవసరాలకు సరిపోయేదానిని ఎంచుకోవాలి. మీరు ప్రమాదంలో తప్పు చేసినట్లు తేలితే, ఇతరులకు కలిగే గాయాలు, నష్టాలను కూడా కవర్ చేయడానికి మోటారు వాహనాల చట్టం ప్రకారం కనీసం మూడవ పక్ష బాధ్యత బీమా అవసరం. అదనపు కవర్లు మరింత రక్షణ అందిస్తాయి.

ఇన్స్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ)..

మీ బైక్‌ బ్రాండ్, వయసు, మోడల్ ప్రకారం తగిన ఐడీవీని ఎంచుకోవాలి. నష్టం జరిగినప్పుడు, బండి దొంగతనానికి గురైనప్పుడు మెరుగైన క్లెయిమ్ చెల్లింపును స్వీకరించడానికి అనుమతించబడిన అత్యధిక ఐడీవీని ఎంచుకోండి. .

ప్రీమియం లెక్కింపు..

బీమా కోసం మీరు వ్యక్తిగతంగా కంపెనీలను సంప్రదించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లో నిమిషాలలోనే బీమా సంస్థల ప్రీమియం మొత్తాన్ని సులభంగా పరిశీలించవచ్చు. వివిధ పాలసీలు, క్లెయిమ్ ప్రయోజనాలు, మినహాయింపులు, రైడర్ కవరేజీని తదితర వాటినన్నింటినీ పూర్తిగా తెలుసుకోవాలి.

క్లెయిమ్ చరిత్ర..

పాలసీదారుడు గతంలో తక్కువ క్లెయిమ్‌లను దాఖలు చేసినట్లయితే బీమా కంపెనీలు కూడా తక్కువ ధరను వసూలు చేస్తాయి. అలాగే గత ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్‌లు దాఖలు చేయనప్పుడు నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాన్ని అందిస్తాయి. దాని వల్ల కూడీ మీరు చెల్లించే ప్రీమియం తగ్గుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..