Mutual Funds: పెట్టుబడిదారులకు అలర్ట్.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..

మ్యూచువల్ ఫండ్స్ అనే మాట ఇటీవల కాలంలో చాలా బాగా వినిపిస్తోంది. గతంలో పట్టణ ప్రజలే వీటిపై ఆసక్తి చూపేవారు. ఇప్పడు గ్రామీణులు కూడా వీటిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే వాటిలో పెట్టుబడులు పెట్టేముందు కొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

Mutual Funds: పెట్టుబడిదారులకు అలర్ట్.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..
Investment
Follow us

|

Updated on: Sep 11, 2024 | 8:15 PM

సంపదను పెంచుకోవడానికి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఉత్తమ పెట్టుబడి మార్గాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. అలాంటి వాటిలో మ్యూచువల్ ఫండ్స్ ముందుంటాయి. వీటిలో కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో రాబడిని అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ అనే మాట ఇటీవల కాలంలో చాలా బాగా వినిపిస్తోంది. గతంలో పట్టణ ప్రజలే వీటిపై ఆసక్తి చూపేవారు. ఇప్పడు గ్రామీణులు కూడా వీటిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే వాటిలో పెట్టుబడులు పెట్టేముందు కొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ కింది తెలిపిన విషయాలను పూర్తిగా అర్థం చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ పై స్పష్టత వస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ అంటే..

ముందుగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. స్టాక్ లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కలిగిన వారి నుంచి సేకరించిన డబ్బు అని అర్థం. పెట్టుబడి దారుడు తన ఇన్వెస్ట్ మెంట్ ఆధారంగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కలిగి ఉంటాడు.

పెట్టుబడి లక్ష్యాలు..

మీ పెట్టుబడి లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా అవసరం. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు పదవీ విరమణ, విద్య, సంపద నిర్మాణం కోసం పెట్టుబడి పెడుతున్నారా అనే విషయంపై అవగాహన పెంచుకోవాలి. దాని ఆధారంగానే మీకు సరిపడే మ్యూచువల్ ఫండ్‌లను ఎంపిక చేస్తారు.

డైరెక్ట్ , రెగ్యులర్ ప్లాన్లు..

డైరెక్ట్ ప్లాన్ లో మీరు నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెడతారు. మధ్యవర్తి లేనందున తక్కువ ఖర్చులు, అధిక రాబడికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్ లో డిస్ట్రిబ్యూటర్, బ్రోకర్ ద్వారా పెట్టుబడి పెడతారు. లావాదేవీల కోసం వారికి కొంత కమీషన్ చెల్లించాలి. దీని వల్ల రాబడి కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

కేవైసీ..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారందరూ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర గుర్తింపు రుజువులు అవసరం.

పెట్టుబడి మార్గాలు..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి రెండు ప్రాథమిక మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏఎంసీ వెబ్ సైట్లు. అంటే నేరుగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) వెబ్‌సైట్ల నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండో పద్ధతితో జెరోదా కాయిన్ (Zerodha Coin), గ్రో (Groww), ఏంజెల్ వన్ (Angel One), పేటీఎమ్ మనీ (Paytm Money) తదితర థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాంలను ఉపయోగించవచ్చు. ఇవి బహుళ ఫండ్‌లను ట్రాక్ చేయడంతో పాటు పెట్టుబడి పెట్టడాన్ని సులభం చేస్తాయి.

ఫండ్స్ ఎంపిక..

మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఫండ్ ఎంపిక చేసుకోవడం చాాలా కీలకం.

  • ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లు దీర్ఘకాలిక వృద్ధికి బాగుంటాయి. అయితే కొంచెం రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. ఐదేళ్లకు మించిన లక్ష్యాలకు తగినవి.
  • డెట్ మ్యూచువల్ ఫండ్‌లతో రిస్క్ తక్కువగా ఉంటుంది. స్వల్పకాలిక లక్ష్యాలు, తక్కువ అస్థిర ఆదాయ ఉత్పత్తికి అనుకూలం.
  • హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ, డెట్ మిశ్రమం. వీటి ద్వారా రిస్క్, రిటర్న్‌లను బ్యాలెన్స్ చేయవచ్చు.
  • ఇండెక్స్ ఫండ్‌లు/ఈటీఎఫ్‌లు: ఇవి నిర్దిష్ట ఇండెక్స్ (నిఫ్టీ 50 వంటివి) పనితీరును అనుకరిస్తాయి.

ఎస్ఐపీ, లంప్ సమ్..

  • సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)లో నెలవారీ నిర్ణీత మొత్తాన్నిపెట్టుబడి పెట్టవచ్చు. జీతం పొందే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది.
  • లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రధాన నగరాల్లో ఎలాఉన్నాయంటే
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రధాన నగరాల్లో ఎలాఉన్నాయంటే
సీజేఐ ఇంట గణేష్ పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ.. వీడియో వైరల్
సీజేఐ ఇంట గణేష్ పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ.. వీడియో వైరల్
DSC అభ్యర్ధులకు అలర్ట్.. టెట్‌ వివరాల సవరణకు నేడు, రేపు ఛాన్స్!
DSC అభ్యర్ధులకు అలర్ట్.. టెట్‌ వివరాల సవరణకు నేడు, రేపు ఛాన్స్!
Horoscope Today: ఆర్థిక ఇబ్బందుల నుంచి వారు బయటపడుతారు..
Horoscope Today: ఆర్థిక ఇబ్బందుల నుంచి వారు బయటపడుతారు..
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ