Electric Vehicles Benefits: వారెవ్వా ఏం టెక్నాలజీ గురూ.. ఎలక్ట్రిక్ బైక్‌లలో ఈ ఫీచర్లు చూశారా.. పెట్రోల్ ఇంజిన్లలో కనపడనే కనపడవు..
సంప్రదాయ ఇంధన వాహనాల స్థానాన్ని పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా ఆక్రమించేస్తున్నాయి. అయితే అసలు సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాల కన్నా ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు క్లిక్ అవుతున్నాయి? దానిలో ఉండే ప్రయోజనాలు ఏంటి? ఏయే విషయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి?

భవిష్యత్తు ఆటో రంగం అంతా విద్యుత్ వాహనాలదే. ప్రస్తుత ట్రెండ్ దానిని సూచిస్తోంది. ముఖ్యంగా ద్విచక్రవాహనాల్లో అందునా స్కూటర్లలో ఎలక్ట్రిక్ వేరియంట్లుకు విపరతీమైన డిమాండ్ ఏర్పడుతోంది. మార్కెట్లో అందుకనుగుణంగానే కొత్త కొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్(ఐసీఈ) వాహనాలు మాత్రం రోజురోజుకీ తన స్థానాన్ని కోల్పోతున్నాయి. వాటి స్థానాన్ని పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా ఆక్రమించేస్తున్నాయి. అయితే అసలు సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాల కన్నా ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు క్లిక్ అవుతున్నాయి? దానిలో ఉండే ప్రయోజనాలు ఏంటి? ఏయే విషయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి? చూద్దాం రండి..
ప్రధాన ప్రయోజనాలు ఇవి..
సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్లతో ఎలక్ట్రిక్ వాహనాలను పోల్చినప్పుడు ప్రధానంగా కనిపించే ప్రయోజనాలు రెండు. అవేంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ మెయింటెనెన్స్, అలాగే తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉంటుంది. అలాగే అనేక టెక్నికల్ ఆంశాల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా చాలా ముందున్నాయి. అలాగే ధర విషయంలో కూడా కేవలం రూ. 1.50 లక్షల రేంజ్‌లోనే మంచి ఎలక్ట్రిక్ వాహనాలు వస్తుండటం మరో కారణం. టెక్నికల్ అంశాలను ఇప్పుడు పరిశీలిద్దదాం..
పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్.. సాంకేతికత పరంగా ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ముందున్నాయి. ముఖ్యంగా వాటిల్లో ఉండే కలర్‌ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ దాదాపు ఓ ట్యాబ్లెట్ అంతా సైజ్ లో ఉంటున్నాయి. ఇవి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. దీనిలో స్పీడ్, ఫ్యూయల్ కెపాసిటీ వంటివి దీనిలో కనిపిస్తాయి. నావిగేషన్, రైడింగ్ మోడ్, రియల్ టైం రేంజ్ ఇండికేటర్, కంట్రోల్ మ్యూజిక్ స్పీకర్స్, డిజిటల్ ఎల్‌సీడీ స్క్రీన్స్ ఉంటాయి. అలాగే కొన్ని మోడర్న్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో టచ్ స్క్రీన్ కూడా అందుబాటులో ఉంటోంది. ఏథర్ 450ఎక్స్, ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి స్కూటర్లలో అతి పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్స్ ఉంటున్నాయి.



మ్యూజిక్ ప్లే బ్యాక్ స్పీకర్స్.. ప్రస్తుత వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో అందుబాటులో ఉంటున్న మరో ఫీచర్ మ్యూజిక్ సిస్టమ్. దీనిలో ఇన్ బిల్ట్ స్పీకర్స్ వస్తున్నాయి. ఇది స్కూటర్ బ్యాటరీపై ఆధారపడి పనిచేస్తాయి. ఓలాఎస్1, ఓలాఎస్1 ప్రో, రీవోల్ట్ ఆర్‌వీ 400 ఈ బైక్ వంటి వాటిల్లో ఈ బిల్ట్ ఇన్ స్పీకర్లు వస్తున్నాయి.
బిల్ట్ ఇన్ సిమ్ కార్డు.. మోడర్న్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇన్ బిల్ట్ 4జీ సిమ్‌కు కనెక్ట్ అయ్యే అనేక ఫీచర్లతో వస్తున్నాయి. అయితే వినియోగదారులు వీటిని ప్రత్యేకంగా రీచార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇతర హార్డ్ వేర్ సదుపాయం అవసరం లేకుండానే రియల్ టైం లోకేషన్ ను ఈ సిమ్ ఆధారంగా ఈ స్కూటర్లు అందిస్తాయి. అలాగే జియో ఫెన్సింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఏథర్ 450ఎక్స్, ఓలా ఎస్1 సిరీస్ స్కూటర్లు, అలాగే బౌన్స్ ఇన్‌ఫినిటీ ఈ1 స్కూటర్లలో ఈ ఫీచర్లు ఉన్నాయి.
సాఫ్ట్ వేర్ అప్‌డేట్లు, కొత్త ఫీచర్లు.. చాలా ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం వాహనాలుగా మాత్రమే కాక స్మార్ట్ ఫోన్లుగా కూడా ఉపయోగపడుతున్నాయి. అందుకోసం బిల్ట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటున్నాయి. అలాగే కొత్త అప్ డేట్లు, సరికొత్త ఫీచర్లు అందిస్తున్నాయి. కొన్ని పగ్స్ ఫిక్స్ చేయడం, బ్యాటరీ లైఫ్ ని పెంచడానికి బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కూడా సాఫ్ట్ వేర్ రూపంలో అందుబాటులో ఉంటుంది.
యాప్ సపోర్టు.. కొన్ని సంప్రదాయ ఇంధన వాహనాల్లో కూడా యాప్‌లు సపోర్టు చేస్తున్నాయి. అయితే ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు మరింత అధికంగా, సులభంగా, వేగంగా పనిచేస్తున్నాయి. వాహనాన్ని స్టార్ట్ చేయడానికి, ఆపడానికి, బ్యాటరీ పరిస్థితిని మోనిటర్ చేయడానికి యాప్‌లు ఉన్నాయి. అలాగే కొన్ని ఈవీల్లో డిజిటల్ కీ కూడా అందుబాటులో ఉంది. ఏథర్ 450ఎక్స్, ఓలా వంటి స్కూటర్లలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లో సపోర్టు చేసే యాప్ లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..