ఇటీవల కాలంలో రిఫ్రిజిరేటర్ అనేది చాలా సాధారణం అయిపోయింది. ప్రతి ఇంట్లో ఇది ఉండాల్సిన ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అయితే ఈ రిఫ్రిజిరేటర్లలో చాలా రకాలు ఉన్నాయి. సింగిల్ డోర్, డబుల్ డోర్, ఫోర్ డోర్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఫ్రిడ్జ్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే చిన్న ఇంట్లో, ఒకరిద్దరు వ్యక్తులకు మాత్రమే అయితే మినీ ఫ్రిడ్జ్ లు సరిపోతాయి. అలాంటి వారు వేలకు వేలు ఖర్చు పెట్టి పెద్ద ఫ్రిడ్జ్ లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి మినీ ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్స్ కి ఇవి బాగా ఉపయోగపడతాయి. మీ కూల్ డ్రింక్స్, కూరగాయలు, ఇతర సామగ్రిని అందులో భద్ర పరచుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటి ధర కూడా అనువుగా ఉంటుంది. రూ. 5000 నుంచి రూ. 15,000లోపు ధరతో ఉంటాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో బెస్ట్ మినీ ఫ్రిడ్జ్ లను మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..
మిడియా 93 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్.. తక్కువ స్థలంలో ఇట్టే ఇమిడిపోయే బెస్ట్ కాంపాక్ట్ కూలింగ్ సొల్యూషన్ ఇది. ఇది స్టెబిలైజర్ లేకుండా పని చేయగలుగుతుంది. అడ్జస్టబుల్ లెగ్స్, డోర్ లాక్, రివర్సిబుల్ డోర్ సౌలభ్యం భద్రతను మెరుగుపరుస్తుంది. గట్టి గాజు షెల్ఫ్, పెద్ద బాటిల్ ర్యాక్ ఉంటుంది. ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ 90.0, ఫ్రీజర్ కెపాసిటీ 20.0తో ఉంటుంది. ఒక ఏడాది మానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది. విద్యుత్ వినియోగం విషయానికి వస్తే సింగిల్ స్టార్ రేటింగ్ ఉంటుంది.
హైస్సెన్స్ 45 లీటర్ల 4 స్టార్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్.. ఇది బీఈఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన ఫ్రిడ్జ్. 4-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంటుంది. డైరెక్ట్-కూల్ టెక్నాలజీ ఖర్చు-ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఒక సంవత్సరం మానుఫ్యాక్చరింగ్ వారంటీ, 10-సంవత్సరాల కంప్రెసర్ వారంటీని అందిస్తుంది. ఇది చూడటానికి చిన్నగా కనిపిస్తున్నా.. లోపల ఫుడ్ కెపాసిటీ ఎక్కువగానే ఉంటుంది. 45 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది.
కూలూలీ మినీ ఫ్రిజ్.. ఈ మినీ ఫ్రిజ్ సౌలభ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారికి మంచి ఆప్షన్. వసతి గృహాలు, కార్యాలయాలు లేదా ప్రయాణాలకు అనువైనది. దీని పోర్టబుల్ డిజైన్ మీకు ఇష్టమైన స్నాక్స్, పానీయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చేస్తుంది. పర్యావరణ అనుకూల శీతలీకరణ వ్యవస్థ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఇది బెస్ట్ లుకింగ్ డిజైన్ ఆకర్షిస్తుంది. కూలింగ్ వ్యవస్థ కూడా చాలా సాధికారంగా పనిచేస్తుంది. దీని కెపాసిటీ నాలుగు లీటర్లు మాత్రమే. దీనిని కారులోకూడా పెట్టుకొని తీసుకెళ్లిపోవచ్చు. ఇది ఏసీ/డీసీ కరెంట్లలో పనిచేస్తంది. బయటి ఉష్టోగ్రత 40 డిగ్రీల ఉన్న సమయంలో కూడా లోపలి వస్తువులను చల్లగా ఉంచుతుంది. సౌకర్యవంతమైన క్యారీ హ్యాండిల్‌తో వస్తుంది.
గోద్రెజ్ 30 ఎల్ క్యూబ్ పర్సనల్ స్టాండర్డ్ సింగిల్ డోర్ కూలింగ్ సొల్యూషన్.. తిస్మినీ ఫ్రిజ్ అనేది భారతదేశంలో తయారు చేయబడిన ఒక కాంపాక్ట్ ఉత్పత్లి. ఇది గృహాల నుంచి కార్యాలయాల వరకు, హోటళ్ల నుంచి బడ్డీ షాపుల వరకు, పూజ గదుల నుంచి వానిటీ స్పేస్‌ల వరకు విభిన్న అవసరాలకు వినియోగించకోవచ్చు. 30-లీటర్ సామర్థ్యంతో ఉండే ఈ చిన్న ఫ్రిజ్ నిల్వ పవర్‌హౌస్, కంప్రెసర్ లేదా రిఫ్రిజెరాంట్ లేకుండా ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. అధునాతన సాలిడ్ స్టేట్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. గోద్రెజ్ క్యూబ్ శక్తి-సమర్థవంతమైన శీతలీకరణ కోసం చిన్న థర్మోఎలెక్ట్రిక్ చిప్‌ను ఉపయోగిస్తుంది. రెండె ఎల్ఈడీ లైట్లు దాని లోపలి భాగంలో వెలుగుతాయి. అయితే దాని సూపర్ సైలెంట్ ఆపరేషన్ శాంతియుత అనుభవాన్ని నిర్ధారిస్తుంది. 8⁰C నుండి 10⁰C వరకు శీతలీకరణ సామర్థ్యంతో డీఫ్రాస్టింగ్ అవాంతరాలను లేకుండా అందిస్తుంది.
హైసెన్స్ 94 ఎల్ 3 స్టార్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్.. ఇది మంచి స్పేస్-సేవింగ్ ఫ్రిడ్జ్. బీఈఈ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ మినీ ఫ్రిడ్జ్ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. 4-లీటర్ సామర్థ్యంతో, ఇది గ్లాస్ షెల్ఫ్‌లు, పండు/కూరగాయల పెట్టె, 2-లీటర్ కంటైనర్‌ల కోసం ప్రత్యేకమైన బాటిల్ బిన్‌తో కూడిన స్థలాన్ని అందిస్తుంది. ఫ్రీజర్ విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. 1-సంవత్సరాల మానుఫ్యాక్చరింగ్ వారంటీ, 10-సంవత్సరాల కంప్రెసర్ వారంటీతో ఈ ఫ్రిడ్జ్ వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..