EV Maintenance: మీకు ఎలక్ట్రిక్ వాహనం ఉందా? అయితే ఈ మెయింటెనెన్స్ టిప్స్ మీ కోసమే..

ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు, స్కూటర్లకు కూడా మెయింటెనెన్స్ అవసరం అవుతుంది. అయితే పెట్రోల్ డీజిల్ ఇంజిన్ వాహనాలతో పోల్చితే ఇది చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అంతర్గతంగా కదిలే భాగాలు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండవు. దీంతో మెయింటెనెన్స్ తక్కువ అవసరం అవుతుంది. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన అంశాలను ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్ విషయంలో వినియోగదారులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

EV Maintenance: మీకు ఎలక్ట్రిక్ వాహనం ఉందా? అయితే ఈ మెయింటెనెన్స్ టిప్స్ మీ కోసమే..
Electric Car Charging

Updated on: Aug 02, 2023 | 10:39 AM

కాలం మారుతోంది. సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లు, కార్లు పెద్ద ఎత్తున మార్కెట్లో కి క్యూ కడుతున్నాయి. వినియోగదారులు కూడా వీటిపై అధిక ఆసక్తిని కనబరుస్తున్నారు. ధర కాస్త ఎక్కువైన వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే సాధారణపెట్రోల్, డీజిల్ వాహనాలు మంచి రన్నింగ్ కండిషన్‌లో ఉండాలంటే ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అవసరం. విడిభాగాలను తనిఖీ చేయాలి. అవసరం అయితే మార్చుకుంటూ ఉండాలి. అదే విధంగా ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు, స్కూటర్లకు కూడా మెయింటెనెన్స్ అవసరం అవుతుంది. అయితే పెట్రోల్ డీజిల్ ఇంజిన్ వాహనాలతో పోల్చితే ఇది చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అంతర్గతంగా కదిలే భాగాలు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండవు. దీంతో మెయింటెనెన్స్ తక్కువ అవసరం అవుతుంది. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన అంశాలను ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్ విషయంలో వినియోగదారులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో బ్యాటరీ, టైర్లు, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్లు వంటవి ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన టాప్ 5 మెయింటెనెన్స్ టిప్స్ మీకు అందిస్తున్నాం.. ఓ లుక్కేయండి..

బ్యాటరీ హెల్త్.. ఇంధనంతో నడిచే పెట్రోల్, డీజిల్ కార్ల మాదిరిగా కాకుండా, ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీలతో నడుస్తాయి. ప్రధానంగా ఇవి లిథియం-అయాన్ ఆధారితం. బ్యాటరీ నిర్వహణ అనేది ఈవీ మొత్తం మెయింటెనెన్స్ లో అంతర్భాగం. బ్యాటరీ మంచి ఆకృతిలో ఉందో లేదో తనిఖీ చేయాలి. దీనికి సాంకేతిక నిపుణులు అవసరం.

ఫ్లూయిడ్స్ అండ్ లూబ్రికెంట్స్.. ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీతో నడుస్తాయి. అయినప్పటికీ వీటిలో ఫ్లూయిడ్స్ లేదా లూబ్రికెంట్లు అవసరమయ్యే కొన్ని భాగాలు ఉంటాయి. వాటిల్లో బ్రేక్స్ ఒకటి. బ్రేక్ ఆయిల్ కారు బ్రేక్ సిస్టమ్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు బ్రేక్ ఆయిల్‌తో పాటు వాషర్ ఫ్లూయిడ్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

సస్పెన్షన్‌ సిస్టమ్.. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల మాదిరిగానే, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా రోడ్లపై కఠినమైన పాచెస్‌ను ఎదుర్కొంటాయి. అలాంటి సమయంలో సస్పెన్షన్ మీకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లపై సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఈ సస్పెన్షన్ మీకు ఉపయోగపడుతుంది. అందుకే కారు సస్పెన్షన్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, అవసరమైన మెయింటెనెన్స్ చేయడం అవసరం.

టైర్లు మార్చుకోవాలి.. టైర్లను సకాలంలో మార్చుకోవడం అనేది ఏ వాహనానికైన అవసరం. టైర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. లేకుంటే ప్రమాదాల బారిన పడతారు. ముందు టైర్లు వెనకకు, వెనుక టైర్లు ముందుకు మార్చుకుంటూ ఉంటే టైర్లు ఎక్కువ కాలం మన్నుతాయి.

క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్.. ఎలక్ట్రిక్ వాహనాలు క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌లను కలిగి ఉంటాయి. ఇవి స్వచ్ఛమైన గాలిని ఏసీ వెంట్ల ద్వారా క్యాబిన్‌లోకి ప్రవేశించేలా చేస్తాయి. క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ మంచి కండిషన్‌లో ఉన్నట్లయితే, అది ఎయిర్ కండిషన్ సిస్టమ్ మృదువైన పనితీరును కలిగిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..