AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ బ్యాంకుకు లక్షల కోట్ల టర్నోవర్​.. ఎస్‌బీఐ ఛైర్మన్​ ఏడాది జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు

SBI Chairman Salary: వారికి కోట్లల్లో వీరికి లక్షల్లో.. వారిది రిచ్.. వీరిది లోకల్.. ఇలాంటుంది. ప్రభుత్వం.. ప్రైవేటు వ్యవస్థల మధ్య పోలిక. ఈ వివరాలను వెల్లడించారు మాజీ ఎస్బీఐ ఛైర్మన్. ప్రస్తుత యాక్సిస్​ బ్యాంక్​ ఎండీ అండ్​ సీఈఓ అమితాబ్​ చౌదరీ యాన్యువల్​ శాలరీ రూ.7.62 కోట్లు. భారతదేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న బ్యాంకు ఛైర్మన్​ కూడా ఆయనే.. అమితాబ్ చౌదరీ తరువాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ అండ్​ సీఈఓ శశిధర్​ జగదీశన్​ ఏడాది జీతం రూ.6.51 కోట్లు. మరి ఎస్‌బీఐ ఛైర్మన్ జీతం ఎంతో తెలుసా..

ఆ బ్యాంకుకు లక్షల కోట్ల టర్నోవర్​.. ఎస్‌బీఐ ఛైర్మన్​ ఏడాది జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు
Rajnish Kumar
Sanjay Kasula
|

Updated on: Aug 02, 2023 | 8:16 AM

Share

200 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. 46.78 కోట్ల కస్టమర్లు ఉన్న ఎస్‌బీఐ ఏడాదికి రూ.50 లక్షల కోట్ల టర్నోవర్ ఉంది​. కానీ ఆ సంస్థ ఛైర్మన్‌కు మాత్రం ప్రైవేట్​ బ్యాంకు ఛైర్మన్​లతో పోలిస్తే చాలా చాలా తక్కువ జీతం. అయితే, తాను తీసుకున్న జీతం వివరాలను వెల్లడిచారు ఎస్​బీఐ మాజీ ఛైర్మన్​ రజనీశ్ కుమార్. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఈ వివరాలను వెల్లడించారు. తనకు జరిగిన అన్యాయంపూ ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. తాను స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్​‌గా ఉన్నప్పుడు ఏడాదికి కేవలం రూ.28 లక్షలు మాత్రమే తీసుకున్నట్లుగా చెప్పారు. ఆయన నెలకు కేవలం రూ. 2.33 లక్షలు మాత్రమే జీతంగా తీసుకున్నట్లుగా లెక్క.. ఇది పూర్తిగా అన్​ఫెయిర్​ అని కూడా ఎస్​బీఐ మాజీ ఛైర్మన్​ రజనీశ్ కుమార్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అందులో తను ఎస్​బీఐ ఛైర్మన్‌ ​గా ఉన్నప్పుడు అందుకున్న జీతభత్యాల వివరాలు వెల్లడించారు. అలాగే ఆ ఇంటర్వ్యూలో బ్యాంకింగ్​ సిస్టమ్ గురించి, భారత్‌పే వివాదం సహా అనేక విషయాలను ఆయన వెల్లడించారు. జీతంతోపాటు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని రజనీష్ కుమార్ తెలిపారు. కానీ ఆయన జీతం మాత్రం ‘ఒంట్లో జీలకర్ర’లా ఉండేదన్నారు.

ఎస్​బీఐ ఛైర్మన్‌​గా ఉన్నవారికి కేవలం జీతం మాత్రమే కాకుండా.. ఇంకా అనేక ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఛైర్మన్ కుటుంబం నివాసం కోసం మంచి విలాసవంతమైన బంగ్లా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఇతర దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా.. అందుకైన ఖర్చులు సంస్థ చెల్లిస్తుంది. అలాగే రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల విలువైన కారును ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు మెడికల్ ఇన్సూరెన్స్​, హాలీడేస్​, ఫారిన్ ట్రిప్స్​ కూడా ఉంటాయి.

SBI ఛైర్మన్‌కు మలబార్ హిల్స్‌లో విలాసవంతమైన బంగ్లా..

SBI ఛైర్మన్ నివసించడానికి ముంబైలోని మలబార్ హిల్స్‌లో విలాసవంతమైన బంగ్లాను పొందారు. అలాంటి బంగ్లాను ఎవరైనా అద్దెకు తీసుకుంటే నెలకు కనీసం రూ.2 నుంచి 2.5 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని రజనీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. మలబార్ హిల్స్ దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతంగా పరిగణించబడుతుంది.

వారికి వీరికి ఎంత తేడా..

ఇదిలావుంటే ప్రస్తుతం ఎస్బీఐ ఛైర్మన్‌గా ఉన్న దినేష్ కుమార్ ఖారా వార్షిక ఆదాయం కేవలం రూ. 37 లక్షలు మాత్రం. అంటే గత ఛైర్మన్‌ జీతంతో పోలిస్తే కేవలం 7.5 శాతం మాత్రమే జీతం పెరిగింది. ఇక్కడ మరో విషయం ఉంది.. అదేంటంటే ఎస్​బీఐ ఛైర్మన్ బేసిక్​ శాలరీ రూ.27 లక్షలు మాత్రమే. కానీ ఆయనకు రూ.9.99 లక్షల వరకు డియర్​నెస్​ అలవెన్సులు అందుతాయి.

వారికి కోట్లలో.. వీరికి లక్షల్లో..

మరి ప్రైవేటు బ్యాంకుల్లో ఇదే ఛైర్మన్ పోస్టులో ఉన్న వ్యక్తి తీసుకునే జీతం మరోలా ఉంటుంది. ఛైర్మన్ జీతంతోపాటు మన నగరంలోని బ్యాంకు మెనెజర్ జీతం ప్రైవేటు బ్యాంకులో పని చేసే ఇదే స్థాయి ఉద్యోగితో పోల్చితే.. చాలా తక్కువగా ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో లభించే వసతులు కూడా చాలా రిచ్‌గా ఉంటాయి. ప్రస్తుత యాక్సిస్​ బ్యాంక్​ ఎండీ అండ్​ సీఈఓ అమితాబ్​ చౌదరీ యాన్యువల్​ శాలరీ రూ.7.62 కోట్లు. భారతదేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న బ్యాంకు ఛైర్మన్​ కూడా ఆయనే.. అమితాబ్ చౌదరీ తరువాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ అండ్​ సీఈఓ శశిధర్​ జగదీశన్​ ఏడాది జీతం రూ.6.51 కోట్లు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ సందీప్​ భక్షి ఏడాదికి రూ.7.08 కోట్లు జీతంగా అందుకుంటారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..