Car Loans: పోటీ పడి రుణాలిస్తున్న బ్యాంకులు.. కొత్త కారు కొనాలంటే ఇదే బెస్ట్ టైం..
కొత్త కారు కొనడం ఖర్చుతో కూడుతున్న పని. మధ్యతరగతి ప్రజలకు అది కష్టమే. అయినా ఎటువంటి ఆందోళనా వద్దు. కొత్త కారు కొనడానికి బ్యాంకులు రుణాలిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు జీరో డౌన్ పేమెంట్ కార్ లోన్ల ను మంజూరు చేస్తున్నాయి. ఎంపిక చేసిన మోడల్‌లకు ఆన్ రోడ్ ధరలో వందశాతం కవర్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ప్రతి కుటుంబానికి సొంత కారు తప్పసరి అయ్యింది. మధ్య తరగతి ప్రజలు కూడా కార్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సమయానికి వెళ్లడంతో పాటు రక్షణగా కూడా ఉంటుంది. కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నప్పుడు కారు చాలా ఉపయోగంగా ఉంటుంది.
బ్యాంకు రుణాలు..
కొత్త కారు కొనడం ఖర్చుతో కూడుతున్న పని. మధ్యతరగతి ప్రజలకు అది కష్టమే. అయినా ఎటువంటి ఆందోళనా వద్దు. కొత్త కారు కొనడానికి బ్యాంకులు రుణాలిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు జీరో డౌన్ పేమెంట్ కార్ లోన్ల ను మంజూరు చేస్తున్నాయి. ఎంపిక చేసిన మోడల్‌లకు ఆన్ రోడ్ ధరలో వందశాతం కవర్ చేస్తున్నాయి. అంటే మీరు డౌన్ పేమెంట్ గురించి కూడా ఇబ్బంది పడకుండా సొంత కారును సమకూర్చుకోవచ్చు.
అవగాహన అవసరం..
బ్యాంకులు మంజూరు చేసే కారు రుణాలను ఎంత వడ్డీ విధిస్తున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే సరైన బ్యాంకును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. వడ్డీరేట్లు మీరు ప్రతినెలా చెల్లించే ఈఎమ్ఐ లను ప్రభావితం చేస్తాయి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మరింత అనుకూలమైన వడ్డీ రేటుకు రుణం పొందవచ్చు. కాబట్టి మీరు కొనుగోలు చేయాలనుకునే కారు ఫీచర్ల గురించి తెలుసుకోవడంతో పాటు బ్యాంకుల రుణాల వడ్డీరేట్లపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
వివిధ బ్యాంకుల వడ్డీరేట్లు..
కారు కొనుగోలు చేయడానికి వివిధ బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. ప్రముఖ బ్యాంకులు వసూలు చేసే వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజు తదితర వివరాలను తెలుసుకుందాం.
- యూకో బ్యాంకులో కారు లోన్ పై 8.45 నుంచి 10.55 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈఎమ్ఐ రూ.10,246 నుంచి రూ.10,759 వరకూ పడుతుంది. ఈ బ్యాంకులో ప్రాసెసింగ్ ఫీజు లేదు.
- యూనియన్ బ్యాంకులో 8.70 నుంచి 10.45 శాతం వడ్డీ విధిస్తున్నారు. నెలకు రూ.10,307 నుంచి రూ.10,735 వరకూ వాయిదా కట్టాలి. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.వెయ్యి వసూలు చేస్తారు.
- కెనరా బ్యాంకులో వడ్డీరేటు 8.70 నుంచి 12.70 వరకూ ఉంది. ఈఎంఐ 10,307 నుంచి 11,300 వ రకూ పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజుగా 0.25 శాతం అంటే గరిష్టంగా 2500 వసూలు చేస్తారు.
- బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో 8.70 నుంచి 13 శాతం వడ్డీ ఉంటుంది. నెల వాయిదా 10,307 నుంచి 11,377 పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.వెయ్యి నుంచి 15 వేల వరకూ వసూలు చేస్తారు.
- పంజాబ్ నేషనల్ బ్యాంకులో 8.75 నుంచి 10.60 శాతం వడ్డీ, ఈఎంఐ రూ.10,319 నుంచి రూ.10,772 వరకూ, అలాగే ప్రాసెసింగ్ ఫీజు రూ.వెయ్యి నుంచి రూ.1500 లోపు ఉంటుంది.
- స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 8.75 నుంచి 9.80 శాతం వడ్డీ ఉంటుంది. నెలవారీ వాయిదా 10,319 నుంచి 10,554 వరకూ కట్టాలి. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1500 వరకూ వసూలు చేస్తారు.
- ఐడీబీఐలో 8.80 నుంచి 9.60 శాతం వడ్డీ, 10,331 నుంచి 10,525 వరకూ ఈఎమ్ఐ, రూ.2500 వరకూ ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలి.
- ఐసీఐసీఐలో 9.10 శాతం నుంచి వడ్డీ, 10,403 నుంచి నెల వాయిదాలు మొదలవుతాయి. 2 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు.
- హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 9.20 నుంచి వడ్డీ, 10,428 నుంచి వాయిదాలు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.3500 నుంచి 8 వేలు వరకూ కట్టాలి.
- ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో 8.85 నుంచి 12 శాతం వడ్డీ, నెల వాయిదా రూ.10,343 నుంచి 11,122 వరకూ ఉంటుంది. రూ.500 నుంచి రూ.5 వేల లోపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
మరిన్ని రాయితీలు..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతం ఉన్న హౌసింగ్ లోన్ తీసుకున్నవారికి, కార్పొరేట్ జీతం ఖాతాదారులకు 0.25 శాతం వడ్డీ రేటు రాయితీని అందిస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 800, అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌లతో రుణగ్రహీతలకు 0.50 శాతం వడ్డీ రేటు రాయితీ ఇస్తోంది. అలాగే 750, 799 మధ్య క్రెడిట్ స్కోర్లు ఉన్నవారు 0.25 శాతం రాయితీని అందుకుంటారు. ఇంకా పీఎస్బీ అప్నా వాహన్ సుగమ్ కోసం ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం వరకు రాయితీ ఆఫర్ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




