AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. తులం ఎంతకు చేరిందంటే..

బంగారం ధరల్లో ప్రతీరోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రూ. 75 వేల మార్క్‌ దాటి దూసుకుపోయిన తులం బంగారం ధర మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో రూ. 74 వేల మార్క్‌ దగ్గర కొనసాగుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం ధరలు కాస్త శాంతించాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,290గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర..

Gold Price Today: బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. తులం ఎంతకు చేరిందంటే..
Gold Price
Narender Vaitla
|

Updated on: May 23, 2024 | 6:27 AM

Share

బంగారం ధరల్లో ప్రతీరోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రూ. 75 వేల మార్క్‌ దాటి దూసుకుపోయిన తులం బంగారం ధర మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో రూ. 74 వేల మార్క్‌ దగ్గర కొనసాగుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం ధరలు కాస్త శాంతించాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,290గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,440గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 74,650 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,290గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,830 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,290 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,290గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,290కాగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,500గా ఉంది.

* సాగరనగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,290గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రదేశాల్లో కిలో వెండి ధర ఇప్పటికే లక్ష దాటిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో ఢిల్లీతో పాటు, కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 95,900కి చేరింది. అలాగే చెన్నై, హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 100400కి ఎగబాకింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ