SBI: ఎస్‌బీఐలో ఖాతా తెరవాలంటే హామీదారు సంతకం అవసరమా..? కస్టమర్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన బ్యాంకు

|

Aug 07, 2021 | 10:58 AM

SBI: గతంలో ఏదైనా బ్యాంకులో ఖాతా తెరవాలంటే అడ్రస్‌ ఫ్రూప్‌తో ఓ వ్యక్తి సంతకం అవసరం ఉండేది. ఖాతా తెరిచేందుకు అతను హామీదారు (షూరిటీ)గా ఉండేందుకు అని ఆయన సంతకంతో..

SBI: ఎస్‌బీఐలో ఖాతా తెరవాలంటే హామీదారు సంతకం అవసరమా..? కస్టమర్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన బ్యాంకు
Follow us on

SBI: గతంలో ఏదైనా బ్యాంకులో ఖాతా తెరవాలంటే అడ్రస్‌ ఫ్రూప్‌తో ఓ వ్యక్తి సంతకం అవసరం ఉండేది. ఖాతా తెరిచేందుకు అతను హామీదారు (షూరిటీ)గా ఉండేందుకు అని ఆయన సంతకంతో పాటు ఆయనకు సంబంధించిన పత్రాలు కూడా బ్యాంకులో సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నిబంధనలు మారిపోయాయి. తాజా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. అలాంటివేమి లేవు. ఖాతా తెరిచేందుకు ఒక్క ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు ఉంటే సరిపోతుంది. ఇటీవల ఈ-కేవైసీకి సంబంధించిన మాస్టర్‌ సర్య్కూలర్‌ ఆర్‌బీఐ ద్వారా అప్‌డేట్‌ చేయబడింది. ఈ కొత్త సర్క్యూలర్‌ ప్రకారం.. కొత్త ఖాతా తెరిచేందుకు ఆధార్‌, పాన్‌ నెంబర్‌ను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.

అయితే ఓ వినియోగదారుడు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ట్విటర్‌ హ్యాండిల్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసేందుకు గ్యాంటర్‌ అవసరమా..? ఆధార్‌ మాత్రమే సరిపోతుందా..? అన్న ప్రశ్నకు ఎస్‌బీఐ శాఖ సమాధానం ఇచ్చింది. ఖాతా తెరిచేందుకు అందుకు సంబంధించిన ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. అలాగే కేవైసీ తప్పనిసరి. మరింత సమాచారం కోసం బ్యాంకుకు సంబంధించిన లింక్‌లను కూడా పంచుకోండి అంటూ తెలిపింది.

బ్యాంకు అకౌంట్‌ తెరవాలంటే ఈ పత్రాలు తప్పనిసరి

ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకులో అకౌంట్‌ తీయాలంటే అవసరమైన పత్రాలు సమర్పించాలని ఎస్‌బీఐ తెలిపింది. బ్యాంకులో ఉండే ఫారమ్‌ నింపాడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను జత చేయడం ద్వారా ఖాతాను ఓపెన్‌ చేసుకోవచ్చు. పాన్‌కార్డు, ఫారం-60, అందుకు చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు, ఫోటోలు కావాల్సి ఉంటాయి. ఇవే కాకుండా ఖాతాదారుని ప్రస్తుత చిరునామా డాక్యుమెంట్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌, ఓటరు ఐడి కార్డు, అలాగే జాతీయ జనాభా రిజిస్టర్‌ ద్వారా జారీ చేయబడిన రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేఖ, విద్యుత్‌ బిల్లు, టెలిఫోన్‌ బిల్లు, మొబైల్‌ పోస్టు పెయిడ్‌ బిల్లు, గ్యాస్‌, నీటి బిల్లు ఇందులో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇవేకాకుండా ఆస్తి లేదా మున్సిపాలిటీ పన్ను రశీదుతో కూడా ఖాతా ఓపెన్‌ చేయవచ్చు. ప్రభుత్వ రంగంలోని రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం జారీ చేసే పెన్షన్‌ లేదా పెన్షన్‌ చెల్లింపు ఉత్తర్వులు కూడా సమర్పించవచ్చు.

పొదుపు ఖాతా వల్ల ప్రయోజనం ఏమిటి..?

బ్యాంకులో వ్యక్తిగత పని కోసం ఎవరైనా డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు సేవింగ్స్‌ ఖాతాను తీయవచ్చు. అయితే సేవింగ్‌ ఖాతాలో డిపాజిట్‌ చేసిన డబ్బులపై కూడా వడ్డీ పొందవచ్చు. ఇది 2 నుంచి 6 శాతం వరకు ఉంటుంది.

 

 

ఇవీ కూడా చదవండి

Customers Alert: ఈ బ్యాంకులో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు.. సెప్టెంబర్‌ 30 వరకు వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు

Saving Account: మీకు పొదుపు ఖాతా ఉందా..? దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తారా..? లేదా.. పూర్తి వివరాలు