మన దేశంలో బ్యాంకింగ్ రంగం డిజిటల్ బాటలో వేగంగా పయనిస్తోంది. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) రాకతో ఆర్థిక లావాదేవీల స్వరూపమే మారిపోయిందని చెప్పాలి. అసలు బ్యాంకులకు వెళ్లడమే అవసరం లేకుండా సులువుగా, సులభంగా లావాదేవీలు జరుపుకనే అవకాశం ఇప్పుడు ఏర్పడింది. వీధి చివరి బట్టి కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ యూపీఐ సర్వీస్ లేని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ మేక్ ఇన్ ఇండియా ఇన్వెన్షన్.. మేక్ ఫర్ ద వరల్డ్ నినాదంతో గ్లోబల్ వైడ్ గా సత్తా చాటేందుకు సమాయత్తమైంది. ఇప్పటికే యూపీఐ సర్వీసెస్ ప్రపంచంలోని ఏడు దేశాలు అంగీకరిస్తున్నాయి. ఇటీవల శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ పేమెంట్స్ విధానాన్ని ప్రారంభించగా.. అంతకన్నా ముందే ఫ్రాన్స్, యూఏఐ, సింగపూర్, భూటాన్, నేపాల్ వంటి దేశాలు అనుమతించాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ మెసేజ్ ను షేర్ చేసింది. అందులో ప్రపంచ మ్యాప్‌ను ఉంచుతూ భారతీయులు చెల్లింపులు చేయడానికి యూపీఐని ఉపయోగించగల దేశాలను హైలైట్ చేసింది. దానిపై మేక్ ఫర్ ద వరల్డ్ అని క్యాప్షన్ ఇచ్చింది.
UPI goes Global!🤩
India’s Unified Payments Interface goes International with launches in Sri Lanka and Mauritius! ఇవి కూడా చదవండిAn instant, one-stop payment interface showcases ‘Make in India, Make for the World’. #DigitalPayment #RuPay pic.twitter.com/EI8LBWxZCi
— MyGovIndia (@mygovindia) February 12, 2024
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అనేది భారతదేశంలో ప్రారంభించిన మొబైల్ ఆధారిత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థ. ఇది వర్చువల్ చెల్లింపు చిరునామా (వీపీఏ)ని ఉపయోగించి కస్టమర్‌లు 24 గంటలూ తక్షణ చెల్లింపులను చేయడానికి అనుమతిస్తుంది. భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపులకు దాని ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. భారత ప్రభుత్వం యూపీఐ ప్రయోజనాలను భారతదేశానికే పరిమితం చేయకుండా ప్రపంచమంతా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయంగా దీనిని అందుబాటులో ఉంచాలని లక్ష్యాంగా నిర్ధేశించుకుంది. యూపీఐ 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ప్రారంభమైంది. వేగంగా విస్తరించింది.
యూపీఐ సర్వీస్ 300కి పైగా బ్యాంకులను కలుపుతుంది. బ్యాంకింగ్ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్ పే, పేటీఎం, టీపాప్(థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు) ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేని ఆర్థిక లావాదేవీలను అనుమతిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..