సురక్షిత పెట్టుబడి పథకాల్లో అత్యంత జనాదరణ పొందినవి ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ). వీటిల్లో పెట్టుబడికి అధిక వడ్డీతో పాటు కచ్చితమైన రాబడి వస్తుంది. దీంతో వీటిల్లో ప్రజలు ధైర్యంగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ వీటిల్లో అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు అన్ని చోట్ల ఒకేలా ఉండవు. బ్యాంకుల్లో ఒకలా, పోస్టాఫీసుల్లో ఒకలా వడ్డీ రేటు ఉంటుంది. బ్యాంకుల్లో ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీ రేటు ఉంటుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకలా, ప్రైవేటు బ్యాంకుల్లో మరోలా ఉంటాయి. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కూడా అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. గత రెండేళ్లుగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. చాలా బ్యాంకులు 9% కంటే ఎక్కువగానే వడ్డీ రేటు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఏడాది టెన్యూర్ కి 7 శాతం కంటే అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకులను మీకు జాబితా చేసి అందిస్తున్నాం. మీరు కనుక ఎఫ్‌డీ చేయాలనుకుంటే ఈ కథనాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఇందులో ప్రైవేట్, పబ్లిక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అన్ని ఇస్తున్నాం. అవి కూడా 7శాతం కంటే అధికంగా వడ్డీ ఇచ్చే బ్యాంకులు. ఓ లుక్కేయండి..
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్.. ఈ బ్యాంకులో ఒక సంవత్సరం కాలపరమితితో కూడిన ఎఫ్‌డీపై 7.15% వడ్డీ రేటును అందిస్తోంది.
డ్యుయిష్ బ్యాంక్.. ఈ బ్యాంకులో కనుక మీరు ఒక సంవత్సరం కాలపరిమితి ఎఫ్‌డీ తీసుకుంటే.. దానిపై 7% వడ్డీ రేటును అందిస్తోంది.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (టీఎంబీ).. ఈ ప్రైవేటు బ్యాంకులో మీరు ఒక సంవత్సరం కాలపరిమితితో ఎఫ్‌డీ చేస్తే మీకు 7% వడ్డీ రేటు పొందుకోవచ్చు.
రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ (ఆర్బీఎల్) .. ఈ బ్యాంకులో మీరు ఒక సంవత్సరం కాలపరిమితితో ఎఫ్‌డీ చేస్తే 7% వడ్డీ రేటును పొందుకోవచ్చు.
కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ).. ఈ బ్యాంకు ఒక సంవత్సరం కాలపరిమితితో కూడిన ఎఫ్‌డీపై 7% వడ్డీ రేటును అందిస్తోంది.
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్.. దీనిలో ఎఫ్‌డీ ఒక సంవత్సరం కాలపరిమితితో తీసుకుంటే 7.10% వడ్డీ రేటును అందుకోవచ్చు.
ఇండస్ఇండ్ బ్యాంక్.. ఈ బ్యాంకులో ఒక సంవత్సరం కాల వ్యవధిపై ఎఫ్‌డీ చేస్తే 7.5% వడ్డీ రేటును పొందుకోవచ్చు.
డెవలప్‌మెంట్ క్రెడిట్ బ్యాంక్ (డీసీబీ).. ఈ బ్యాంకు ఒక సంవత్సరం కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీపై 7.15% వడ్డీ రేటును అందిస్తోంది.
బంధన్ బ్యాంక్.. ఒక సంవత్సరం కాల వ్యవధి ఎఫ్‌డీపై ఈ బ్యాంకు 7.25% వడ్డీ రేటును అందిస్తోంది.
క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీపై ఈ బ్యాంకు 7.5% వడ్డీ రేటును అందిస్తోంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీపై 8.2% వడ్డీ రేటును ఇస్తోంది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంకులో ఒక సంవ్సతరం కాలపరిమితిపై ఎఫ్‌డీ చేస్తే 7.65% వడ్డీ రేటు పొందుకోవచ్చు.
జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీపై ఈ బ్యాంకు 8% వడ్డీ రేటును అందిస్తోంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీపై ఈ బ్యాంకు 8.25% వడ్డీ రేటు ఇస్తోంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంకులో ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీ చేస్తే 7.35% వడ్డీని అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..