కచ్చితమైన రాబడితో పాటు భద్రత, భరోసానిచ్చే స్కీమ్స్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్స్(ఎఫ్‌డీ) మొదటివి అయితే, రెండో రికరింగ్ డిపాజిట్స్(ఆర్‌డీ). ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టి, కొంత కాల వ్యవధి తర్వాత తీసుకునేది ఎఫ్‌డీ అయితే.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ మాదిరిగా నెల నెలా ఇన్వెస్ట్ చేసేలా అవకాశం కల్పించేది ఆర్‌డీ. రెండు అధిక వడ్డీ, మంచి రాబడితో పాటు బహుళ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తాయి. ఎటువంటి రిస్క్ లేకుండా మీకు రాబడినిస్తాయి. ఈ ధన త్రయోదశి నాడు మీరు ఎటువంటి రిస్క్ లేని అధిక రాబడినిచ్చే పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు ఈ పథకాలు బెస్ట్. ఒకవేళ మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేకపోతే రికరింగ్ డిపాజిట్ల వైపు చూడొచ్చు. దీనిలో నెలనెలా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాంకులో ఆర్ డీ ఓపెన్ చేయాలనుకుంటే దానిలో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? వాటిల్లో అధిక వడ్డీనిచ్చే బ్యాంకు ఏది? తెలుసుకుందాం రండి..
రికరింగ్ డిపాజిట్లు క్రమశిక్షణతో కూడిన పొదుపు విధానానికి ప్రసిద్ధి చెందాయి, ఇన్వెస్టర్లు సంవత్సరాల తరబడి ఏకమొత్తంలో పొదుపును కూడగట్టుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. దీనిలో పెట్టుబడులు స్థిర కాల వ్యవధిని కలిగి ఉంటాయి. సాధారణంగా 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటాయి. ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటుపై ఆధారపడి గణనీయమైన రాబడిని అందిస్తాయి. దీనికి అధిక ప్రారంభ పెట్టుబడి అవసరం లేకుండా క్రమపద్ధతిలో పొదుపు చేయడానికి, వారి పొదుపుపై వడ్డీని సంపాదించాలని చూస్తున్న వ్యక్తులకు ఇవి ఆదర్శవంతమైన ఎంపిక. ప్రస్తుతం, అనేక బ్యాంకులు ఆర్డీలపై 8.5% వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ ప్రస్తుతం 27, 36 నెలల మధ్య ఆర్డీ పెట్టుబడులపై 8.60% వార్షిక వడ్డీఅందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, అదే కాలవ్యవధికి వడ్డీ రేటు 9.1%గా ఉంది.
డీసీబీ బ్యాంక్.. ఈ బ్యాంక్ ప్రస్తుతం దేశంలో ఆర్డీలపై రెండో అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. రూ. 10 లక్షల నుండి రూ. 2 కోట్ల మధ్య ఉన్న డిపాజిట్లపై 8% వార్షిక వడ్డీ రేటు ఉంటుంది. రూ. 1 లక్ష కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్‌లపై బ్యాంక్ 1.75% వార్షిక వడ్డీని కూడా అందిస్తుంది.
డ్యుయిష్ బ్యాంక్.. ఇది 27, 36 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఆర్డీలపై సంవత్సరానికి 8% వడ్డీని అందిస్తుంది. 5 సంవత్సరాల కాలవ్యవధికి ఆర్డీలపై 7.25% వడ్డీ రేటును అందిస్తుంది.
యాక్సిస్ బ్యాంక్.. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న 5 సంవత్సరాల ఆర్ డీలపై 7.10% వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఇది 7.60% ఇస్తుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఈ ప్రైవేట్ బ్యాంక్ 15 నెలల ఆర్ డీలపై 7.1% వడ్డీ రేటును అందిస్తుంది. అదే వ్యవధిలో, సీనియర్ సిటిజన్లు 7.6% వడ్డీ రేటును అందుకుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..