
ఇటీవల కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు మంచి పథకాన్ని ప్రకటంచింది. తమ ఇంటిని సోలార్ పవర్ స్టేషన్ గా మర్చుకునే అవకాశాన్ని అందించింది. అంటే మీ మేడపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ యూనిట్ ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేకమైన సబ్సిడీలను ప్రకటించింది. అంతేకాక దాని నుంచి వచ్చే విద్యుత్ ను మీరు వినియోగించుకోగా.. మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వానికి విక్రయించే విధంగా కొత్త స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం పేరు ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఇది రూఫ్‌టాప్ సౌర విద్యుత్ యూనిట్లను ఇన్‌స్టాల్ చేసుకునే గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ఉద్దేశించిన పథకం.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద మీరు ఇంటిపై సోలార్ పలకను ఏర్పాటు చేసుకోవచ్చు. దాని సామర్థ్యాలకు అనుగుణంగా కేంద్రం మీకు సబ్సిడీలు అందిస్తుంది. 2 కేడబ్ల్యూ సామర్థ్యం ఉన్న సిస్టమ్‌లకు సోలార్ యూనిట్ ధరలో 60%, అలాగే 2కేడబ్ల్యూ నుంచి 3 కేడబ్ల్యూ సామర్థ్యం మధ్య సిస్టమ్‌ల కోసం 40% సబ్సిడీని అందిస్తుంది. సబ్సిడీ గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యం వరకూ పరిమితం చేసింది. ప్రస్తుత బెంచ్‌మార్క్ ధర ప్రకారం, ఇది 1కేడబ్ల్యూ సిస్టమ్‌కు రూ. 30,000, 2కేడబ్ల్యూ సిస్టమ్‌కు రూ. 60,000, 3కేడబ్ల్యూ లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్‌కు రూ. 78,000 సబ్సిడీగా అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ కోసం బ్యాంకులు రుణ సదుపాయం కూడా అందిస్తున్నాయి. సబ్సిడీ కేంద్రం ఇస్తున్నా.. మిలిగిన మొత్తం కూడా రుణ రూపంలో తీసుకొనే అవకాశం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలానుగుణంగా నిర్ణయించే ప్రస్తుత రెపో రేటు ఆధారంగా వడ్డీ రేటు మారుతుంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 3కేడబ్ల్యూ సామర్థ్యం వరకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. దీనికి ప్రాసెసింగ్ ఫీజు ఏమి ఉండదు. ఎంఎన్ఆర్ఈ ద్వారా నిర్దేశించబడిన అన్ని అవసరమైన సాధ్యాసాధ్యాల నివేదికలను సమర్పించిన తర్వాత నేరుగా విక్రేత / ఈపీసీ కాంట్రాక్టర్‌కు నగదు పంపిణీ అవుతుంది. రుణం మొత్తం + రుణగ్రహీత మార్జిన్(10శాతం) అందిస్తుంది. గరిష్టంగా రూ. 2లక్షల వరకూ లోన్ వస్తుంది. గరిష్టంగా 120 నెలల్లో (మారటోరియం వ్యవధితో సహా) తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 7%గా ఉంటుంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. రెసిడెన్షియల్ గ్రిడ్-కనెక్ట్ చేయబడిన రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్‌లకు ఫైనాన్సింగ్ ఇన్‌స్టాలేషన్ కోసం పీఎన్బీ స్కీమ్ ఫర్ ఫైనాన్సింగ్ రూఫ్ టాప్ సోలార్ (ఆర్టీఎస్) ప్రాజెక్ట్ పేరుతో బ్యాంక్ ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. 3కేడబ్ల్యూ వరకు రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్‌లకు ఫైనాన్సింగ్ చేస్తుంది. గరిష్ట లోన్ మొత్తం రూ. 2 లక్షలు. 10 సంవత్సరాల కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 7శాతం ఉంటుంది. ప్రాసిసింగ్ చార్జీలు ఉండవు.
కెనరా బ్యాంక్.. 3కేడబ్ల్యూ సామర్థ్యం వరకూ అయ్యే ఖర్చును లోన్ తీసుకోవచ్చు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో కనీసం 10% రుణగ్రహీత చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ చార్జీలు ఉండవు. గరిష్టంగా రూ.2.00 లక్షల వరకు (సబ్సిడీతో సహా).
10 సంవత్సరాల కాల వ్యవధితో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 7శాతం వడ్డీ రేటు ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ బ్యాంకులో కూడా 3కేడబ్ల్యూ వరకూ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. 2లక్షలు రుణం అందుతుంది. 120 ఈఎంఐలుగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. గరిష్ట రుణ మొత్తం 3 కేడబ్ల్యూ సామర్థ్యం వరకు రూ 2.00 లక్షలు. 10 సంవత్సరాల కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 7శాతం వడ్డీ రేటు ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఈ బ్యాంక్ లో గరిష్టంగా రూ. 2.00 లక్షల వరకూ లోన్ ఇస్తారు. ఇది కూడా 3కేడబ్ల్యూ సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఇన్ స్టాలేషన్ ను ఏర్పాటుచేసుకోవచ్చు. అలాగే 3 కేడబ్ల్యూ నుంచి 10 కేడబ్ల్యూ వరకూ రూ. 10లక్షల రుణమొత్తం పొందొచ్చు. గరిష్ట రుణ పదవీకాలం 10 సంవత్సరాలు (6 నెలల మారటోరియంతో కలిపి). 3కేడబ్ల్యూ కోసం తీసుకున్న రుణానికి వడ్డీ రేటు 7శాతం ఉంటుంది. అదే సమయంలో 3కేడబ్ల్యూ నుంచి 10 కేడబ్ల్యూ సామర్థ్యానికి అయితే వడ్డీ రేటు వ్యక్తుల సిబిల్ స్కోర్ ఆధారంగా 9.15శాతం వరకూ ఉంటుంది.
ఇండియన్ బ్యాంక్.. 3కేడబ్ల్యూ సామర్థ్యం వరకూ గరిష్టంగా రూ. 2లక్షల రుణాన్ని అందిస్తారు. పదేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ప్రస్తుత వడ్డీ రేటు 7శాతం ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 3కేడబ్ల్యూ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటుకు అవసరమయ్యే మొత్తాన్ని రుణంగా పొందొచ్చు. గరిష్టంగా రూ. 2లక్షల వరకూ అందిస్తారు. మారటోరియంతో కలిపి పదేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 7శాతంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..