Home Loans: గృహ రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే.. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ అంటే..

|

Jul 21, 2024 | 3:16 PM

హోమ్ లోన్ తీసుకునే ముందు మీ ఆర్థిక స్తోమతను అంచనా వేసుకోవాలి. వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర చార్జీల గురించి వాకబు చేయాలి. పైగా అన్ని బ్యాంకుల్లో హోమ్ లోన్ రేట్లు ఒకేలా ఉండవు. ముందుగానే అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల వద్ద మీ రుణానికి సంబంధించిన రేట్ల వివరాలను తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఫైనాన్స్ సంస్థల్లో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను మీకు అందిస్తున్నాం..

Home Loans: గృహ రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే.. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ అంటే..
Bank Home Loan
Follow us on

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దానిని నెరవేర్చుకునేందుకు అందరూ కష్టపడుతుంటారు. అది ఆర్థికంగా చాలా భారమైనది కావడంతో చాలా మందికి కలగానే మిగిలిపోతోంది. అయితే ఇటీవల కాలంలో చాలా మంది హోమ్ లోన్(గృహ రుణం)లను ఆశ్రయిస్తున్నారు. సులభ వాయిదాలలో ఈ లోన్లు చెల్లించుకునే వెసులుబాటు ఉండటం, తక్కువ వడ్డీ రేటు ఉండటంతో అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే ఇది జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఒకసారి పెద్ద మొత్తం హోమ్ లోన్ తీసుకుంటే.. దాని కోసం ఏళ్ల పాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మీరు తీసుకునే లోన్ పై వడ్డీరేటు, మీరు నిర్ణయించుకున్న కాల వ్యవధి ఆధారంగా ఒక్కోసారి మీరు చెల్లించే మొత్తం మీరు రుణంగా తీసుకున్న మొత్తం కంటే రెట్టింపు అవుతుంది. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు మీ ఆర్థిక స్తోమతను అంచనా వేసుకోవాలి. వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర చార్జీల గురించి వాకబు చేయాలి. పైగా అన్ని బ్యాంకుల్లో హోమ్ లోన్ రేట్లు ఒకేలా ఉండవు. ముందుగానే అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల వద్ద మీ రుణానికి సంబంధించిన రేట్ల వివరాలను తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఫైనాన్స్ సంస్థల్లో హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను మీకు అందిస్తున్నాం.. ఓ లుక్కేయండి..

ప్రభుత్వ రంగ బ్యాంకులు..

  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్లపై 8.35 శాతం నుంచి 10.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్లపై 8.4 శాతం నుంచి 10.90 శాతం వరకూ వడ్డీ రేట్లు విధిస్తోంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.4 శాతం నుంచి 10.25 శాతం వరకూ వడ్డీరేట్లకు హోమ్ లోన్లను అందిస్తోంది.
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్లపై వడ్డీ రేటు 8.4 శాతం నుంచి 10.85 శాతం వరకూ ఉంది.
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్లపై వడ్డీ రేటు 8.45 శాతం నుంచి 9.80 శాతం వరకు ఉంది.

ఈ రేట్లు మీరు తీసుకునే రుణ మొత్తం, మీ సిబిల్ స్కోర్, మీరు నిర్ణయించుకున్న టెన్యూర్ ఆధారంగా మారుతుంటుంది. అందరికే ఒకే రకమైన రేట్లు ఉండవు.

ప్రైవేట్ రంగ బ్యాంకులు..

  • కర్ణాటక బ్యాంకులో హోమ్ లోన్లపై 8.50 శాతం నుంచి 10.62 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది.
  • హెచ్ఎస్బీసీ బ్యాంక్ హోమ్ లోన్లపై వడ్డ రేటు 8.50 శాతంగా ఉంది.
  • కోటక్ మహీంద్రా బ్యాంక్లో హోమ్ లోన్లపై 8.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • సౌత్ ఇండియన్ బ్యాంక్లో హోమ్ లోన్లపై వడ్డీ రేటు 8.70 శాతం నుంచి 11.70 శాతం వరకు ఉంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్లపై 8.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఈ రేట్లు కూడా మీరు తీసుకునే రుణ మొత్తం, మీ సిబిల్ స్కోర్, మీరు నిర్ణయించుకున్న టెన్యూర్ ఆధారంగా మారుతుంటుంది. అందరికే ఒకే రకమైన రేట్లు వర్తించవు.

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు..

  • ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రేటు హోమ్ లోన్లపై 8.50 శాతం నుంచి 10.75 శాతం వరకు ఉంది.
  • బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో హోమ్ లోన్లపై 8.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో హోమ్ లోన్లపై 8.55 శాతం వడ్డీ రేటు ఉంది.
  • ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థలో హోమ్ లోన్లపై 8.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • టాటా క్యాపిటల్ సంస్థ 8.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  • పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 8.50 శాతం నుంచి 14.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
  • మ్మాన్ క్యాపిటల్ (గతంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్) 8.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..