Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు అలర్ట్.. దీనిని చెక్ చేసుకోకపోతే లావాదేవీలు బంద్..

|

Apr 11, 2024 | 2:08 PM

ఎంఎఫ్ సెంట్రల్, సీఏఎంఎస్ వంటి మ్యూచువల్ ఫండ్ బదిలీ ఏజెన్సీలు (ఆర్టీఏలు) తమ అధికారిక వెబ్‌సైట్‌లలో ఇటీవల ఒక విషయాన్ని ప్రముఖంగా తెలియజేశాయి. పెట్టుబడిదారుల పేరు, పుట్టిన తేదీ వివరాలు వారి పాన్ కార్డు, మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) ఫోలియోలో ఒకేలా ఉండాలి. అలా ఉండకపోతే వారి లావాదేవీలు జరగవు. ఈ నెలఖారు నుంచి (2024 ఏప్రిల్ 30) నుంచి ఈ నిబంధనల అమలులోకి వస్తుంది.

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు అలర్ట్.. దీనిని చెక్ చేసుకోకపోతే లావాదేవీలు బంద్..
Mutual Fund
Follow us on

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఇటీవల పెరిగాయి. చాలామంది వాటిలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా లావాదేవీలను జరుపుతున్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు మన వివరాలు అందజేస్తాం. అయితే కొందరు పెట్టుబడిదారుల పేరు, పుట్టిన రోజు వివరాలు తేడా ఉంటున్నాయి. వారి పాన్ కార్డులో ఒకలా, మ్యుచువల్ ఫండ్ ఫోలియోలో మరోలా ఉంటున్నాయి. వీటిని తప్పనిసరిగా సరి చేసుకోవాలని మ్యూచువల్ ఫండ్ బదిలీ ఏజెన్సీలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ 30వ తేదీలోపు లోపాలను సరిదిద్దుకోకుంటే లావాదేవీలు ఆగిపోయే ప్రమాదం ఉంది.

లావాదేవీలకు ఇబ్బంది..

ఎంఎఫ్ సెంట్రల్, సీఏఎంఎస్ వంటి మ్యూచువల్ ఫండ్ బదిలీ ఏజెన్సీలు (ఆర్టీఏలు) తమ అధికారిక వెబ్‌సైట్‌లలో ఇటీవల ఒక విషయాన్ని ప్రముఖంగా తెలియజేశాయి. పెట్టుబడిదారుల పేరు, పుట్టిన తేదీ వివరాలు వారి పాన్ కార్డు, మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) ఫోలియోలో ఒకేలా ఉండాలి. అలా ఉండకపోతే వారి లావాదేవీలు జరగవు. ఈ నెలఖారు నుంచి (2024 ఏప్రిల్ 30) నుంచి ఈ నిబంధనల అమలులోకి వస్తుంది.

వివరాలను పరిశీలించండి..

పెట్టుబడిదారులు తమ మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో పేరు, పుట్టిన తేదీ వివరాలను పరిశీలించాలి. అవి వారి పాన్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో సరిచూసుకోవాలి. అన్నింటిలోనూ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఏప్రిల్ 30 లోగా సరిదిద్దుకోవాలి.

మార్గదర్శకాలు..

దీనిపై ఇటీవల సెబీ నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. పాన్ కార్డు ధ్రువీకరణకు ఆదాయపు పన్ను శాఖ చేసిన మార్పులకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నారు. లావాదేవీలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పెట్టుబడిదారులు తమ దరఖాస్తులు, కేవైసీ ఫారాలలో తమ పేరు, పుట్టిన రోజు వివరాలు ఒకేలా ఉండేలా చూసుకోవాలి.

ఈ పత్రాలను సమర్పించండి..

సెబీ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం కేవైసీలో పేరు, ఇతర వివరాలను సరిచేసుకోవడానికి ఈ కింద తెలిపిన పత్రాలు సమర్పించాలి.

  • పాస్ పోర్టు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఆధార్ కార్డు
  • ఓటు గుర్తింపు కార్డు
  • ఉపాధి హామీ జాబ్ కార్డు
  • కేంద్రం గుర్తించిన ఇతర పత్రాలు
  • వీటితో పాటు ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, గెజిటెడ్ అధికారుల లేఖలు వంటి పత్రాలు.

జాగ్రత్తలు తీసుకోండి.

  • పేరు, పుట్టిన రోజు వివరాలలో వ్యత్యాసాలను సరిదిద్దడమే కాకుండా, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు ఈ క్రింది చర్యలను చేపట్టాలి.
  • అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాలతో (ఓవీడీ) కేవైసీ పత్రాలలోని వివరాలను సరిచూసుకోవాలి. అలా లేకపోతే అప్‌డేట్ చేయాలి. నిర్లక్ష్యం వహిస్తే వారి కేవైసీ చెల్లదు. ఆర్థిక లావాదేవీలకు ఇబ్బందులు కలుగుతాయి.
  • కొత్త పెట్టుబడి దారులకు నామినేషన్ లేదా నిర్ధారణను తప్పనిసరి చేశారు. అలాగే 2022 అక్టోబరు ఒకటికి ముందు అందజేసిన ఫోలియోలకు సంబంధించి 2024 జూన్ 30 లోపు నామినేషన్‌ను పూర్తి చేయాలి. దీనిని ఎంఎఫ్ సెంట్రల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా డిజిటల్‌గా చేసుకునే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..