AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stocks: 5 రోజుల్లో 90 శాతం రాబడి.. మార్కెట్ నష్టాల్లో ఉన్నా లాభాలు కురిపించిన షేర్లు..!

గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల ధోరణి, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల మూలధన ప్రవాహం కారణంగా గత వారం మార్కెట్ నష్టాల్లోనే ఉంది. అయితే, కొన్ని స్టాక్స్ మాత్రం మంచి పనితీరుతో ఆకట్టుకున్నాయి. కనబరిచాయి.

Multibagger Stocks: 5 రోజుల్లో 90 శాతం రాబడి.. మార్కెట్ నష్టాల్లో ఉన్నా లాభాలు కురిపించిన షేర్లు..!
DSCR
Venkata Chari
|

Updated on: Jan 16, 2022 | 9:57 PM

Share

Multibagger Stocks For 2022: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం చివరి ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఊపందుకోవడం కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీ స్వల్ప క్షీణతతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల ధోరణి, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ నష్టాల్లోనే నిలిచింది. 30 షేర్ల సెన్సెక్స్ 12.27 పాయింట్లు అంటే 0.02 శాతం క్షీణించి 61,223.03 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 2.05 పాయింట్లు అంటే 0.01 శాతం నష్టంతో 18,255.75 వద్ద ముగిసింది. ఈ సమయంలో 5 స్టాక్‌లు తమ పెట్టుబడిదారులకు 90 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి.

RTCL: ఈ స్మాల్ క్యాప్ కంపెనీ మార్కెట్ ప్రస్తుతం రూ.26.28 కోట్లుగా ఉంది. గత వారం 5 ట్రేడింగ్ సెషన్లలో ఈ స్టాక్ 91.43 శాతం పెరిగింది. 5 రోజుల్లో ఈ స్టాక్ రూ.11.44 నుంచి రూ.21.90కి పెరిగింది. శుక్రవారం దాదాపు 10 శాతం లాభంతో రూ.21.90 వద్ద ముగిసింది.

దౌలత్ సెక్యూరిటీస్: ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.20.78 కోట్లుగా ఉంది. గత వారం ఈ కంపెనీ షేరు రూ.24.85 నుంచి రూ.41.55కి పెరిగింది. కంపెనీ షేర్ల నుంచి ఇన్వెస్టర్లకు 67.20 శాతం రాబడి వచ్చింది. శుక్రవారం ఈ షేరు దాదాపు 5 శాతం లాభంతో రూ.41.55 వద్ద ముగిసింది.

సాధన నైట్రోకెమ్: ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,178.21 కోట్లుగా ఉంది. గత వారం, ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 65.21 శాతం రాబడిని ఇచ్చింది. ఈ షేరు రూ.67.40 నుంచి రూ.111.35కి పెరిగింది. శుక్రవారం ఈ షేరు 5 శాతం లాభంతో రూ.111.35 వద్ద ముగిసింది.

ఛాయిస్ ఇంటర్నేషనల్: ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.992.73 కోట్లుగా ఉంది. దీని స్టాక్ గత వారం రూ.159.35 నుంచి రూ.249.40కి పెరిగింది. ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 56.51 శాతం రాబడిని ఇచ్చింది. శుక్రవారం ఈ షేరు దాదాపు 14 శాతం లాభంతో రూ.249.40 వద్ద ముగిసింది.

వాస్వానీ ఇంటర్నేషనల్: గత వారం ఈ స్టాక్ రూ.18.70 నుంచి రూ.29.20కి చేరింది. ఈ స్టాక్ నుంచి ఇన్వెస్టర్లకు 56.15 శాతం రాబడి లభించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.87.60 కోట్లుగా ఉంది. శుక్రవారం ఈ షేరు దాదాపు 10 శాతం లాభంతో రూ.29.20 వద్ద ముగిసింది.

గమనిక: ఈ కథనం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచింది.

Also Read: Budget 2022: రాబోయే బడ్జెట్ నుంచి బ్యాంకింగ్ రంగంలో ఎటువంటి మార్పులు మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు?

EV Charging Stations: ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు సులభతరం.. ప్రభుత్వం నిబంధనలు మార్చింది..!