Credit Cards Offer: ఈ క్రెడిట్‌ కార్డులపై బంపర్‌ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌..!

|

Jan 11, 2022 | 7:10 AM

Credit Cards Offer:ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆన్‌లైన్‌ షాపింగ్స్‌, ఇతర ఈ షాపింగ్ మాల్స్‌, అలాగే తదితర..

Credit Cards Offer: ఈ క్రెడిట్‌ కార్డులపై బంపర్‌ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌..!
Follow us on

Credit Cards Offer:ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆన్‌లైన్‌ షాపింగ్స్‌, ఇతర ఈ షాపింగ్ మాల్స్‌, అలాగే తదితర వాటికి క్రెడిట్‌ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే క్రెడిట్‌ కార్డులు అనేవి అవసరానికి అదుకుంటాయి. అయతే కార్డును జాగ్రత్తగా వాడితే మంచిది లేకపోతే అధిక పెనాల్టీలు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక పలు క్రెడిట్‌ కార్డులపై కూడా ఆఫర్లు ఉంటాయి. షాపింగ్‌, ఇతర వాటికి క్యాష్ బ్యాక్‌, ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. సరిగ్గా వాడుకుంటే మంచి ప్రయోజనాలే ఉంటాయి. పలు బ్యాంకు క్రెడిట్‌ కార్డులపై ఇస్తున్న ఆఫర్లు ఇవే..

యాక్సిస్‌ బ్యాంకు ఏస్‌ క్రెడిట్‌ కార్డుపై
యాక్సిస్‌ బ్యాంకు ఏస్‌ క్రెడిట్‌ కార్డుపై ఆఫర్లు ఉన్నాయి. గూగుల్‌ పే ద్వారా చేసే యుటిలిటీ బిల్లు మొత్తంపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది. అంతేకాకుండా ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి వాటిపై కూడా 4 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. అలాగే ఇతర చెల్లింపులపై కూడా 2 శాతం వరకు క్యాష్ బ్యాక్‌ అందిస్తోంది. ఈ కార్డుపై వార్షిక రుసుము రూ.499 ఉంది. భారతదేశంలో400లకుపైగా రెస్టారెంట్లలో 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. అలాగే విమాన ప్రయాణాలపై కూడా 20 శాతం డిస్కౌంది అందిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ రెగాలియా క్రెడిట్‌ కార్డు
హెచ్‌డీఎఫ్‌సీ రెగాలియా క్రెడిట్‌ కార్డుపై కూడా ఆఫర్‌ అందిస్తోంది. లావాదేవీలపై రూ.150 చెల్లింపులపై 4 రివార్డు పాయింట్లను అందిస్తోంది. అంతేకాకుండా విమాన ప్రయాణం, విద్య, ఇంటి అద్దె, రెస్టారెంట్లు ఇతర కొనుగోళ్లపై డిస్కౌంట్‌, రివార్డు పాయింట్లను సైతం అందిస్తోంది.  భారతదేశంలో, ఇతర దేశాలలో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కార్డుపై వార్షిక రుసుము రూ.2,500 ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ డినర్స్‌ క్లబ్‌ ప్రివిలైజ్‌ క్రెడిట్‌ కార్డు
ఈ కార్డుపై కూడా ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌, జొమాటో, టైమ్స్‌, ప్రైమ్‌, బిగ్‌ బాస్కెట్‌ వంటి వాటికి ఏడాది సభ్యత్వాన్ని అందిస్తోంది. వీకెండ్‌ డైనింగ్‌లో 2ఎక్స్‌ రివార్డులను అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెయ్యికి పైగా లాంజ్‌లలో 12 సార్లు ఎయిర్‌పోర్టు లాంజ్‌ యాక్సెస్‌ సదుపాయం అందిస్తోంది. రూ. 400 కనీస లావాదేవీపై 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంది, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ కార్డుపై వార్షిక రుసుము రూ.2,500 ఉంది.

ఎస్‌బీఐ కార్డు ఎలైట్‌:
ఎస్‌బీఐ కార్డు ఎలైట్‌పై ఆఫర్లు అందిస్తోంది. యాత్ర, బాటా, పాంటాలూన్స్‌, షాపర్స్ స్టాప్ వంటి వాటిపై 5వేల రూపాయల వరకు గిఫ్ట్‌ వోచర్లను అందిస్తోంది. కాంప్లిమెంటరీ ట్రైడెంట్ ప్రివిలైజ్ మెంబర్‌షిప్, క్లబ్ విస్తారా మెంబర్‌షిప్ కూడా లభించే అవకాశం దక్కించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన ధర.. తాజా రేట్ల వివరాలు

మీరు ఈ విషయాలలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి తప్పించుకోవచ్చు..! కానీ ఇవి చాలామందికి తెలియదు..