AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా? కేంద్రమంత్రి క్లారిటీ!

GST: డీజిల్, పెట్రోల్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సెంచరీ దాటిన తరువాత కూడా ఇంకా వేగంగా పెరుగుతూనే వస్తున్నాయి.

GST: పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా? కేంద్రమంత్రి క్లారిటీ!
Gst
TV9 Telugu Digital Desk
| Edited By: KVD Varma|

Updated on: Jul 19, 2021 | 3:15 PM

Share

GST: డీజిల్, పెట్రోల్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సెంచరీ దాటిన తరువాత కూడా ఇంకా వేగంగా పెరుగుతూనే వస్తున్నాయి. సామాన్య ప్రజలపై ఈ భారం చాలా ఎక్కువగా ఉంది. పెట్రోల్ పై టాక్స్ లు అధికంగా ఉండడంతోనే ఈ పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు కేంద్ర ప్రభుత్వం వైపు చాలా ఆశగా చూస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు కళ్ళెం వేసేందుకు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు. అయితే, వారి ఆశలను కేంద్ర ప్రభుత్వం తీర్చేలా కనిపించడం లేదు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకురావాలని ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని ఆర్ధిక వ్యవహారాల సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి ఈ విధంగా చెప్పారు.

“పెట్రోల్, డీజిల్ చేర్చడం అనే సమస్యను జీఎస్టీ కౌన్సిల్ పరిగణించవచ్చు. ఇది ఆదాయ చిక్కులతో సహా అన్ని సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని తీసుకోవలసిన నిర్ణయం. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఏదీ జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చకు రాలేదు. ఎల్‌పిజికి సంబంధించి, ఇది ఇప్పటికే జిఎస్‌టి క్రింద ఉంది, ” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

బ్రాండ్ చేయని అదేవిధంగా, బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌పై విధించిన సుంకాలను మంత్రి ఆ ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం అన్ బ్రాండెడ్ పెట్రోల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం సెస్‌లతో సహా రూ. 32.90లు అలాగే, బ్రాండెడ్ పెట్రోల్ పై లీటరుకు 34.10 రూపాయలు ఉంది. ఇక అన్ బ్రాండెడ్ డీజిల్ పై సుంకం సేస్ లతో సహా రూ. 17.46లు అదేవిధంగా, బ్రాండెడ్ డీజిల్ పై లీటరుకు 18.64 రూపాయలుగానూ ఉన్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.

నగదు లావాదేవీలపై పరిమితి యధాతథం..

నగదు లావాదేవీల పరిమితిని పెంచడం గురించి వచ్చిన మరొక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, అలాంటి ప్రణాళిక ఏదీ ప్రస్తుతం లేదన్నారు. దేశాన్ని తక్కువ నగదు పై ఆధారపడే విధంగా చూడాలని ప్రభుత్వ నిర్ణయం అని చెప్పారు. “నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడం మరియు తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్ళడం ప్రభుత్వం ప్రకటించిన విధానం. అందువల్ల, ఆదాయపు పన్ను చట్టం 1961 లోని వివిధ నిబంధనల ప్రకారం అనుమతించదగిన నగదు లావాదేవీల పరిమితిని పెంచే ప్రతిపాదన లేదు” అని మంత్రి చెప్పారు.

Also Read: Central Employees: కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌: 9500 రూపాయల అదనపు ప్రయాణీకుల భత్యం..!

Farmers scheme: రైతుల కోసం మరో పథకం.. రూ. 25 లక్షల వరకు రుణం లభిస్తుంది.. దరఖాస్తు ఎలా చేయాలో తెలుసుకోండి.. ప్రయోజనాలు పొందవచ్చు

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ బాహుబలి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ బాహుబలి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్