వామ్మో… వీరి సంపాదన చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

| Edited By:

Aug 11, 2019 | 9:39 PM

రోజుకు రూ.700 కోట్లు.. గంటకు రూ.28 కోట్లు.. నిమిషానికి రూ.50 లక్షలు.. ఏంటి ఈ నెంబర్లు అనుకుంటున్నారా? ఒక కుటుంబం సంపాదన ఇది. షాకయ్యారా? మైండ్ బ్లాక్ అయ్యిందా? మీరెలా స్పందించినా కూడా మీరు చదివింది మాత్రం నిజం. అమెరికన్ మల్టీ నేషనల్ రిటైల్ కార్పొరేషన్ వాల్‌మార్ట్ యజమాని వాల్టన్ ఫ్యామిలీ ఇంత భారీ స్థాయిలో సంపాదిస్తోంది. 2018 జూన్‌లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా వాల్టన్ ఫ్యామిలీ నిలిచింది. అప్పటి నుంచి చూస్తే ఈ కుటుంబం […]

వామ్మో... వీరి సంపాదన చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
Follow us on

రోజుకు రూ.700 కోట్లు.. గంటకు రూ.28 కోట్లు.. నిమిషానికి రూ.50 లక్షలు.. ఏంటి ఈ నెంబర్లు అనుకుంటున్నారా? ఒక కుటుంబం సంపాదన ఇది. షాకయ్యారా? మైండ్ బ్లాక్ అయ్యిందా? మీరెలా స్పందించినా కూడా మీరు చదివింది మాత్రం నిజం.

అమెరికన్ మల్టీ నేషనల్ రిటైల్ కార్పొరేషన్ వాల్‌మార్ట్ యజమాని వాల్టన్ ఫ్యామిలీ ఇంత భారీ స్థాయిలో సంపాదిస్తోంది. 2018 జూన్‌లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా వాల్టన్ ఫ్యామిలీ నిలిచింది. అప్పటి నుంచి చూస్తే ఈ కుటుంబం సంపద 39 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 191 బిలియన్ డాలర్లకు ఎగసింది.

వాల్టన్ కుటుంబం తర్వాతి స్థానంలో అమెరికా చాక్లెట్‌ సామ్రాజ్యాన్ని ఏలుతున్న మార్స్ ఫ్యామిలీ ఉంది. వీరి సంపద 37 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 127 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే అమెరికా పెట్రోలియం దిగ్గజం కోచ్ ఫ్యామిలీ సంపద కూడా 26 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 125 బిలియన్ డాలర్లకు పరుగులు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 25 సంపన్న కుటుంబాలు ఏకంగా 1.4 ట్రలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. గతేడాదితో పోలిస్తే వీరి సంపద 24 శాతం పెరిగింది. బ్లూమ్‌బర్గ్ సంపన్నుల జాబితాలో మన దేశం నుంచి ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద 50 బిలియన్ డాలర్లకు పైగానే ఉంది.