టెలికాం చార్జీల పెంపు తప్పదా..!

|

Jul 06, 2020 | 7:08 PM

కరోనాతో ఆర్థికంగా చితికపొయిన జనాలపై టెలికాం ఆపరేటర్లు మోత మోగించేందుకు రెడీ అవుతున్నారు. టెలికాం రంగంలో టారిఫ్‌ల పెంపు అనివార్యమని ఈవై అంచనా వేసింది.

టెలికాం చార్జీల పెంపు తప్పదా..!
Follow us on

కరోనాతో ఆర్థికంగా చితికపొయిన జనాలపై టెలికాం ఆపరేటర్లు మోత మోగించేందుకు రెడీ అవుతున్నారు. టెలికాం రంగంలో టారిఫ్‌ల పెంపు అనివార్యమని ఈవై అంచనా వేసింది. కరోనా ప్రభావంతో ప్రస్తుత విధానంతో ఆపరేటర్లకు సరిపడా లాభాలు రావడం లేదని అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో టారిఫ్‌ల పెంపు తప్పపోయినా రెండు విడతల్లో టారిఫ్‌ల పెంపు ఉండొచ్చని ఈవై ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ టెక్నాలజీ లీడర్‌ ప్రశాంత్‌ సింఘాల్‌ అన్నారు. నష్టాల్లో పూరుకుపోయిన టెలికాం రంగాన్ని గట్టేక్కించేందుకు చార్జీల పెంపు తప్పదంటున్నారు. ట్రాయ్ జోక్యం చేసుకుంటుందో లేక పరిశ్రమ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాల్సిందే. టెలికాం ఆపరేటర్లు అందిస్తున్న సేవలకు అనుగుణంగా ధరలు ఉండాలని వెల్లడించారు. వినియోగదారులకు భారం కాకుండా, ఇటు టెలికాం రంగం పునరుజ్జీవం సాధ్యపడుతుందని సింఘాల్‌ అన్నారు.