PPF Investment: లెక్కలోనే అసలు చిక్కు… పీపీఎఫ్‌లో పెట్టుబడితో కోటి రూపాయల రాబడి

|

Jun 02, 2024 | 5:47 PM

1968లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా స్థాపించిన పీపీఎఫ్ చిన్న పొదుపులను సమీకరించడం, ఆదాయపు పన్ను ప్రయోజనాలతో పాటు పెట్టుబడిపై రాబడిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కీమ్‌లో స్థిరమైన, క్రమబద్ధమైన పెట్టుబడితో 25 సంవత్సరాల్లో రూ.1 కోటి పదవీ విరమణ కార్పస్‌ను సృష్టించవచ్చని చాలా మందికి తెలియదు.

PPF Investment: లెక్కలోనే అసలు చిక్కు… పీపీఎఫ్‌లో పెట్టుబడితో కోటి రూపాయల రాబడి
Ppf
Follow us on

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది భారతదేశంలో ప్రసిద్ధ చెందిన దీర్ఘకాల పెట్టుబడి ఎంపిక. ఈ పథకంలో పెట్టుబడి ప్రధానంగా ఆకర్షణీయమైన పన్నుపొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. 1968లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా స్థాపించిన పీపీఎఫ్ చిన్న పొదుపులను సమీకరించడం, ఆదాయపు పన్ను ప్రయోజనాలతో పాటు పెట్టుబడిపై రాబడిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కీమ్‌లో స్థిరమైన, క్రమబద్ధమైన పెట్టుబడితో 25 సంవత్సరాల్లో రూ.1 కోటి పదవీ విరమణ కార్పస్‌ను సృష్టించవచ్చని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో పీపీఎఫ్‌లో పెట్టుబడి ద్వారా కోటి రూపాయలను ఎలా పొందాలో? ఓసారి తెలుసుకుందాం. 

పీపీఎఫ్‌లో కనీస పెట్టుబడి ఏడాదికి రూ.500గా ఉంటే గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. పీపీఎఫ్ అనేది తమ పెట్టుబడి నుంచి గరిష్ట లాభాలను పొందాలని చూస్తున్న జీతాలు, ఇతర వ్యక్తులకు ముఖ్యమైన పెట్టుబడి, పన్ను ఆదా సాధనంగా మారుతుంది. ఈ పథకం 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో వస్తుంది. 15 సంవత్సరాల తర్వాత పీపీఎఫ్ ఖాతాను మూసివేయవచ్చు లేదా పొడిగించవచ్చు. ఈ పథకం ఐదేళ్ల బ్లాకుల్లో పొడిగింపు నిబంధనను కలిగి ఉంది. పీపీఎఫ్ వడ్డీ రేటు ప్రభుత్వం ద్వారా నిర్ణయిస్తారు. అలాగే  ప్రతి త్రైమాసికానికి సవరిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా సంవత్సరానికి 7-8 శాతం మధ్య ఉంటుంది. పీపీఎఫ్ ట్రిపుల్ మినహాయింపు ప్రయోజనాన్ని (ఈఈఈ) అందిస్తుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టిన ప్రిన్సిపల్, సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను నుంచి మినహాయిస్తారు. 

పీపీఎఫ్ ద్వారా కోటి సంపాదన ఇలా

నెలకు రూ.12,500 పెట్టడం ప్రారంభిస్తే ప్రతి ఏడాది మార్చి 31న (లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం) రూ.10,650 వడ్డీగా పీపీఎఫ్ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజున మీ ఖాతా బ్యాలెన్స్ రూ.1,60,650 అవుతుంది. వచ్చే ఏడాది పెట్టుబడి కోసం డిపాజిట్ చేసిన రూ.1,50,000 కలిపితే ఈ మొత్తం రూ.3,10,650 అవుతుంది . ఇప్పుడు ఆ ఆర్థిక సంవత్సరం చివరిలో పీపీఎఫ్ ఖాతాదారు రూ.1,50,000 కి బదులుగా రూ.3,10,650పై వడ్డీని పొందుతారు. అంటే దాదాపు రూ.22,056 అవుతుంది . ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న పీపీఎప్ ఖాతాలో రూ.1,50,000 డిపాజిట్ చేస్తూనే ఉంటే 15 సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత, మొత్తం పెట్టుబడి రూ.22.50 లక్షలు మరియు మీ రాబడి రూ.40.68 లక్షలు, అందులో ₹ 18.18 లక్షలు వడ్డీగా వస్తాయి. PPF ఖాతాను 15 సంవత్సరాలలో మూసివేయడానికి బదులుగా వ్యక్తి ఐదేళ్లపాటు పొడిగిస్తే రూ.30 లక్షల పెట్టుబడి రూ.66.58 లక్షలకు పెరుగుతుంది. అందులో రూ.36.58 లక్షలు వడ్డీ మాత్రమే. మరో పొడిగింపు తర్వాత (మొత్తం వ్యవధి 25 సంవత్సరాలు) పెట్టుబడి రూ.37.50 లక్షలు, వడ్డీ రూ.65.58 లక్షలు కలిపితే రాబడి మొత్త రూ.1.03 కోట్లుగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి