Vande Bharat Sleeper: త్వరలో సికింద్రాబాద్ నుంచి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లో సేవలు.. ఫిక్స్ చేసిన రైల్వేశాఖ!

Indian Railways: సికింద్రాబాద్ నుంచి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు పెట్టేందుకు రంగం సిద్దమవుతోంది. రెండో విడతలో ఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణ సౌకర్యం భారీగా తగ్గనుందని తెలుస్తోంది. ఇతర వివరాలు..

Vande Bharat Sleeper: త్వరలో సికింద్రాబాద్ నుంచి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లో సేవలు.. ఫిక్స్ చేసిన రైల్వేశాఖ!
Vande Bharat Sleeper Train

Updated on: Jan 05, 2026 | 7:52 AM

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త. వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య రానున్న రోజుల్లో ఈ రైలు ప్రవేశపెట్టనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ రూట్లోనే రాజధాని ఎక్స్‌ప్రెస్ నడుస్తోండగా.. ఇందులో వెళ్లాలంటే 22 గంటలకుపైగా సమయం పడుతుంది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే ఒక రోజు పాటు పడుతుంది. నగరం నుంచి తరచూ వేల మంది వివిధ పనుల రీత్యా ఢిల్లీ వెళుతుంటారు. దీంతో ఈ రూట్లో వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళతాయి. దీంతో ఇది అందుబాటులోకి వస్తే కేవలం 18 నుంచి 20 గంటల్లోనే ఢిల్లీకి వెళ్లవచ్చు.

తొలి రైలు ఈ నెలలోనే..

వందే భారత్ తొలి స్లీపర్ రైలును ఈ నెలలో గువహతి-హౌరా మధ్య ప్రవేశపెట్టనున్నారు. ఈ నెలలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైన్‌తో అస్సాం, పశ్చిమ బెంగాల్ మధ్య రవాణా పెరగడంతో పాటు వ్యాపారపరంగా కూడా ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు ఆ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటుంది. ఇది అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. ఇక ఈ ట్రైన్ విజయవంతమైతే రెండో దశలో మరిన్ని ప్రాంతాలకు స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ భావిస్తోంది. అందులో భాగంగా రెండో దశలోనే సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య రైలును తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపపయోగకరంగా ఉంటుంది.

ఈ ఏడాదిలో 12 స్లీపర్ రైళ్లు

2026 చివరి నాటికి మొత్తం 12 స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో సికింద్రాబాద్-ఢిల్లీ రైలు కూడా ఉండనుందని సమాచారం. ప్రస్తుతం సేవలు అందిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ఎక్కువ వేగం, సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేయవచ్చు. సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య 1700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంతదూరం వెళ్లాలంటే సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్‌లో మోడ్రన్ వాష్ రూమ్‌లు, ఏసీ కోచ్‌లు, విమాన తరహాలో ఇంటీరియల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీంతో దూరపు ప్రమాణం చేసేవారు సరికొత్త అనుభూతిని పొందున్నారు.