Credit Cards: క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగితే లాభమా? నష్టమా? ఇలా తెలుసుకోండి!

క్రెడిట్‌ కార్డు వాడేవాళ్లు తరచూ బ్యాంకులు ఫోన్ చేసి క్రెడిట్ లిమిట్ నుపెంచుతామని ఆఫర్ ఇస్తుంటాయి. చాలామంది క్రెడిట్ లిమిట్ పెరగడం వల్ల లాభమే కదా అని ఓకే చెప్తుంటారు. అయితే అసలు క్రెడిట్ లిమిట్ పెరగడం వల్ల నిజంగా లాభం ఉంటుందా? ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Cards: క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగితే లాభమా? నష్టమా? ఇలా తెలుసుకోండి!
అయితే, క్రెడిట్ కార్డులను సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. వాటిని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల అనేక తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే క్రెడిట్ కార్డ్ మొత్తాన్ని తిరిగి పొందడానికి బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చాలా మందికి తెలియకపోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

Updated on: Oct 25, 2025 | 6:16 PM

క్రెడిట్ కార్డును మంచిగా మెయింటెయిన్ చేసేవాళ్లకు బ్యాంకులు క్రెడిట్ లిమిట్ పెంచుతుంటాయి. అయితే  బ్యాంకు ఆఫర్‌ చేసే ఎక్కువ లిమిట్‌ ను యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అనేది తేల్చుకునే ముందు అసలు ఎక్కువ క్రెడిట్ లిమిట్ వల్ల ఉండే ఇబ్బందులు కూడా తెలుసుకోవాలి. అవును! క్రెడిట్ లిమిట్ ను పెంచడం ద్వారా కొన్ని లాభాలతో పాటు మరికొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవేంటంటే..

నష్టం ఇదే..

ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డులు వాడడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ తగ్గే ప్రమాదముంది. ఎలాగంటే.. మీ క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియోని బట్టి క్రెడిట్ స్కోర్ మారుతుంది. అంటే క్రెడిట్‌ కార్డు పరిమితిలో ఎంత శాతం క్రెడిట్‌ను వాడుతున్నారు అన్న దాన్ని బట్టి క్రెడిట్ స్కోర్ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఈ రేషియో 30 శాతం ఉంటే స్కోర్ బాగుంటుంది. ఉదాహరణకు మీ కార్డు లిమిట్ రూ. లక్ష అయితే అందులో నెలు రూ.30 వేల వరకూ వాడుతూ ఉంటే మీ స్కోర్ బాగుంటుంది. ఒకవేళ లిమిట్ రూ. లక్షన్నరకుపెరిగితే అప్పుడు రూ.30 వేల కంటే ఎక్కువ ఖర్చు చేయాలి. 30 శాతం క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఉండాలంటే మీరు  రూ.45 వేలు ఖర్చు చేయాలి. కాబట్టి ఎక్కువ క్రెడిట్ లిమిట్ మీ క్రెడిట్ స్కోర్ ను ఎఫెక్ట్ చేస్తుందని తెలుసుకోండి.

ఖర్చులు పెరగొచ్చు

క్రెడిట్ లిమిట్‌ పెరిగితే మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులపై మీకు నియంత్రణ లేకపోతే ఎక్కువ లిమిట్ ఉంది కదా అని అవసరం కంటే ఎక్కువగా ఖర్చు చేయడం లేదా ఖరీదైన వస్తువులు ఈఎంఐలో కొనుగోలు చేయడం వంటివి పెరుగుతాయి. అప్పుడు పెరిగిన లిమిట్ మీకు లాభం కంటే నష్టం ఎక్కువ చేసినట్టవుతుంది. ఒకవేళ మీ ఆదాయం పెరిగి మీకు నిజంగా ఎక్కువ ఖర్చులు ఉన్నప్పుడు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నప్పుడు క్రెడిట్ లిమిట్ ను పెంచుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి