
AC Prices Hike: మధ్యతరగతి ప్రజలకు త్వరలో మరో షాక్ తగలనుంది. కొత్త ఏడాది వస్తున్న క్రమంలో అనేక వస్తువులు ధరలు పెరగనున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీగా పతనం కావడంతో అనేక వస్తువుల ధరలు పెరగననున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరల కొత్త ఏడాదిలో ఆశాకాన్నంటనున్నాయి. నూతన సంవత్సరంలో ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. మొబైల్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ధరలతో పాటు ఏసీ ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వచ్చే ఏడాది జనవరి నుంచి ఏసీ ధరలు 3 నుంచి 12 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్‌ను ఎక్కువగా ఉపయోగించే 3 స్టార్ ఏసీల ధరలు 3 నుంచి 4 శాతం పెరిగే అవకాశముండగా. . విద్యుత్‌ను తక్కువగా వినియోగించే 5 స్టార్ ఏసీల ధరలు ఏకంగా 12 శాతం పెరగనున్నాయి. ఈ ఏడాది దేశంలోనే విస్తృతంగా వర్షాలు కురిశాయి. దీని వల్ల ఏసీలను ఎక్కువమంది కొనుగోలు చేయలేదు. దీని వల్ల ఏసీలను తయారుచేయడానికి ఉపయోగించే వస్తువులు కంపెనీల వద్ద అలాగే మిగిలి ఉన్నాయి. కొనుగోళ్లు ఎక్కువగా జరక్కోవడం వల్ల ఏసీల నిల్వలు డీలర్ల వద్ద అలాగే ఉన్నాయి. అలాగే జనవరి నుంచి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తెస్తున్న కొత్త నిబంధనలు కూడా ఏసీల ధరలు పెరగడానికి కారణామవుతున్నాయి.
జనవరి 1 నుంచి మరింత నాణ్యమైన వస్తువులను మాత్రమే ఏసీ తయారీకి ఉపయోగించాలని బీఈఈ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. దీని వల్ల ఏసీల తయారీకి ఉపయోగించే లోహలు, ఇతర ముడి పదార్ధాలను నాణ్యతతో కూడుకున్నవి ఉపయోగించాల్సి ఉంటుంది. నాణ్యత గల వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల కంపెనీలపై మరింత భారం పడటం వల్ల ఏసీల ధరలను పెంచనున్నారు. ఇటీవల జీఎస్టీ రేట్ల తగ్గింపు క్రమంలో ఏసీల ధరలు కాస్త తగ్గాయి. కానీ కంపెనీలు తమపై పడే భారం తగ్గించుకునేందుకు ప్రజలపై భారం వేసేందుకు సిద్దమవుతున్నాయి. జనవరి నుంచే ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చాలా వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.