Vande Bharat Train: వందే భారత్ రైళ్లపై బిగ్ అప్డేట్.. వచ్చే ఏడాదిలో కొత్త వెర్షన్.. స్పీడ్‌లో దేశంలోనే సరికొత్త రికార్డ్

రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వందే భారత్ రైలు మరో వెర్షన్ అందుబాటులోకి రానుంది. 2027 నాటికి 4.0 వెన్షన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో చూడండి.

Vande Bharat Train: వందే భారత్ రైళ్లపై బిగ్ అప్డేట్.. వచ్చే ఏడాదిలో కొత్త వెర్షన్.. స్పీడ్‌లో దేశంలోనే సరికొత్త రికార్డ్
Vande Bharat

Updated on: Jan 16, 2026 | 6:33 PM

భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. జనవరి 17వ తేదీన హౌరా-గువహతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు అయింది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడవనుండగా.. ఇందులో కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నవారు మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. వెయిటింగ్, ఆర్‌ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికులు ప్రయాణించడానికి కుదరదు. అలాగే వీఐపీలకు ప్రత్యేక రిజర్వేషన్ సీట్లు ఉండవు. సామాన్యుల్లాగే టికెట్ బుక్ చేసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. సామాన్యులకు అవకాశం కల్పించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ రైళ్ల ఛార్జీల వివరాలను విడుదల చేశారు. అయితే ఈ క్రమంలో వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్ వచ్చింది.

2027లో కొత్త వెర్షన్

వందే భారత్ రైలు కొత్త వెర్షన్ 4.0 తయారీ జరుగుతోంది. 2027లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ రైలు ఏకంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. అహ్మదాబాద్-ముంబై మధ్య ఈ రైలును ప్రవేశపెట్టనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా నిలవనుంది. ఇది మెరుగైన ప్రమాణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా కవచ్ 5.0 వ్యవస్థ ఇందులో ప్రవేశపెడుతున్నారు. గంటకు 350 కిలోమీటర్ల వరకకు హైస్పీడ్ కారిడార్లకు సిద్దంగా ఈ రైలు ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది. 2047 నాటికి ఏకంగా దేశంలో 4500 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

164 వందే భారత్ రైళ్లు

దేశంలో తొలి వందే భారత్ రైలును ఫిబ్రవరి 15,2019న ప్రధాని మోదీ ప్రారంభించారు. వందే భారత్ 2.0 వెర్షన్ సెప్టెంబర్ 30,2022న ప్రారంభించారు. ఇక వందే భారత్ 3.0 వెర్షన్ 2025లో ప్రవేశపెట్టారు. ఇక వందే భారత్ స్లీపర్ రైలును 2026 జనవరిలో ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం దేశంలో 164 వందే భారత్ రైలు సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని 274 జిల్లాలను కవర్ చేస్తున్న ఈ రైళ్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలను ఇవి కలుపుతున్నాయి.

2030 నాటికి 800 వందే భారత్ రైళ్లు

2030 నాటికి 800 వందే భారత్ రైళ్లను తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు చేపడుతోంది. ఇక 2047 నాటికి 4500కు పెంచాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. వందే భారత్ రైళ్లను స్వదేశంలో తయారుచేస్తున్నారు. కవచ్ వంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థలు, ఇందన ఆదా, టెక్నాలజీ వంటి సేలు ప్రీమియం రైలు ప్రయాణంపై ప్రజల్లో విశ్వాశాన్ని పెంచుతాయని రైల్వేశాఖ చెబుతోంది.