AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Government: ఆ బ్యాంకులకు కర్ణాటక ప్రభుత్వం షాక్.. నిధులు ఉపసంహరించుకున్నట్లు వెల్లడి

కర్ణాటక ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో తమ డిపాజిట్లు, పెట్టుబడులన్నింటినీ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.  ఈ బ్యాంకులతో అన్ని వ్యాపారాలను నిలిపివేయాలని దాని అన్ని విభాగాలు, బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ యూనిట్లు, విశ్వవిద్యాలయాలను ఆదేశించింది.

Karnataka Government: ఆ బ్యాంకులకు కర్ణాటక ప్రభుత్వం షాక్.. నిధులు ఉపసంహరించుకున్నట్లు వెల్లడి
Sidda Ramaiah
Nikhil
|

Updated on: Aug 15, 2024 | 4:15 PM

Share

కర్ణాటక ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో తమ డిపాజిట్లు, పెట్టుబడులన్నింటినీ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.  ఈ బ్యాంకులతో అన్ని వ్యాపారాలను నిలిపివేయాలని దాని అన్ని విభాగాలు, బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ యూనిట్లు, విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల కారణంగా ఈ బ్యాంకుల్లో తదుపరి డిపాజిట్లు లేదా పెట్టుబడులు అనుమతించమని కర్ణాటక ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్ & రిసోర్సెస్) పిసి జాఫర్ ఆగస్టు 12 ఓ సర్క్యులర్ జారీ చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమోదించిన ఈ సర్క్యులర్ ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ఖాతాలను క్లోజ్ చేయడానికి సెప్టెంబర్ 20 వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఆయా బ్యాంకులపై ఎందుకు గుర్రుగా ఉందో? ఓసారి తెలుసుకుందాం.

కర్ణాటక  ప్రభుత్వ అధికారులు బ్యాంకు అధికారులతో సమావేశమైనా ఫలితం లేకపోయిందని ఈ విషయం ఇప్పుడు న్యాయస్థానంలో ఉందని సర్క్యులర్‌లో పేర్కొంది. బ్యాంకు ఉద్యోగుల కుంభకోణంతో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు (కేఐఏడీబీ) డిపాజిట్ చేసిన రూ.12 కోట్లను రీడీమ్ చేయడానికి నిరాకరించిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువరించారు. అదేవిధంగా కర్నాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (కెఎస్‌పిసిబి) డిపాజిట్ చేసిన రూ.10 కోట్లు బ్యాంకు అధికారుల కుంభకోణం కారణంగా బ్యాంకు తిరిగి ఇవ్వలేదని సర్క్యులర్‌లో పేర్కొంది. దీనిపై ఆడిటర్ జనరల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని జాఫర్ సర్క్యులర్‌లో తెలిపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని అన్ని శాఖలలో చేసిన అన్ని డిపాజిట్లు/పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ విభాగాలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఉపసంహరించుకోవాలని సర్క్యులర్ ద్వారా తెలియజేశారు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు భవిష్యత్తులో ఎటువంటి డిపాజిట్లు/పెట్టుబడులు చేయకూడదని పేర్కొన్నారు. ఈ రెండు బ్యాంకుల్లోని తమ ఖాతాలను మూసివేయాలని సర్టిఫైడ్ క్లోజర్ రిపోర్టును సమర్పించడానికి సెప్టెంబర్ 20, 2024 గడువు విధించారు. నిర్ణీత ఫార్మాట్‌లో డిపాజిట్లు, పెట్టుబడి నివేదికల వివరాలను ఆర్థిక శాఖకు పంపాలని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..