ATM Card: ఏటీఎం కార్డుకు 4 అంకెల పిన్ మాత్రమే ఎందుకుంటుంది..? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలిస్తే వావ్ అనాల్సిందే..

ఏటీఎం కార్డు.. బ్యాంకు అకౌంట్ వాడే ప్రతీఒక్కరి దగ్గర ఇది ఉంటుంది. ఏటీఎం కార్డ్ వాాడాలంటే పిన్ నెంబర్ తప్పనిసరి. ఈ పిన్ కేవలం 4 అంకెలు మాత్రమే కలిగి ఉంటుంది. అయితే కేవలం 4 అంకెల పిన్ మాత్రమే కలిగి ఉండటం వెనుక ఒక ఆసక్తికర స్టోరీ ఉంది.

ATM Card: ఏటీఎం కార్డుకు 4 అంకెల పిన్ మాత్రమే ఎందుకుంటుంది..? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలిస్తే వావ్ అనాల్సిందే..
దీని తరువాత అతను ATM కార్డుపై 4 అంకెలను మాత్రమే సెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ 6-అంకెల సంఖ్య సురక్షితం. కానీ ఈ 4-అంకెల సంఖ్యలను 0000 నుండి 9999 వరకు మాత్రమే సెట్ చేయవచ్చు. అయితే చాలా దేశాలలో 6-అంకెల సంఖ్యలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోని కొన్ని బ్యాంకులు కూడా తమ వినియోగదారులకు 6-అంకెల సంఖ్యలను అందిస్తాయి.

Updated on: Dec 04, 2025 | 9:09 AM

ATM PIN Usage: బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నవారిలో దాదాపు అందరూ డెబిట్ కార్డును కలిగి ఉంటారు. గతంలో అకౌంట్ తీసుకున్నాక డెబిట్ కార్డు కావాలా..? వద్దా? అని బ్యాంకులు అడిగేవి. మనం కావాలనుకుంటే బ్యాంకులు జారీ చేసేవి. కానీ ఇప్పుడు బ్యాంకులు అకౌంట్‌తో పాటు ఆటోమేటిక్‌గా ఏటీఎం కార్డు, పాస్‌బుక్, చెక్ బుక్‌లు జారీ చేస్తున్నాయి. మీరు ఎంచుకోకపోయినా పోస్ట్ ద్వారా నేరుగా మీ ఇంటికే వీటిని పంపిస్తున్నాయి. ఇప్పట్లో ప్రతీఒక్కరూ ఏటీఎం కార్డులను వినియోగించుకుంటున్నారు. కొంతమంది నిరక్షరాస్యులకు తెలియకపోయినా నమ్మకస్తులైన వ్యక్తుల సహాయం తీసుకుని ఉపయోగిస్తున్నారు. ఏటీఎం కార్డుల వల్ల బ్యాంకులకు వెళ్లి క్యూలైన్‌లో నిలబడాల్సిన అవసరం లేకుండా నగదును సులువుగా తీసుకోవడం లేదా క్రెడిట్ చేయడం వంటి సదుపాయాలు వచ్చాయి. ఏటీఎం కార్డును మీరు వాడేటప్పుడు ఖచ్చితంగా 4 అంకెల సీక్రెట్ పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 4 అంకెల పిన్‌ మాత్రమే ఎందుకు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?

4 అంకెల పిన్ వెనుక రహస్యం

మేఘాలయలోని షిల్లాంగ్‌లో జన్మించిన జాన్ షెపర్డ్-బారన్ అనే వ్యక్తి ఏటీఎం కార్డును 1925లో కనుగొన్నారు. తొలుత దీనిని కనిపెట్టినప్పుడు 6 అంకెల పిన్ ఉపయోగించారు. ఆ తర్వాత ఏటీఎం కార్డును అతను తన భార్య ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. కానీ అతడి భార్య 6 అంకెల పిన్ నెంబర్‌ను గుర్తుపెట్టుకోలేకపోయింది. కేవలం 4 నెంబర్లను మాత్రమే గుర్తుపెట్టుకుంది. దీంతో ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు 4 అంకెలను మాత్రమే ఉపయోగించాలని అతడు నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి ఏటీఎం కార్డు పిన్‌ను 4 అంకెలుగా బ్యాంకులు నిర్ణయించాయి.

కొన్ని బ్యాంకుల్లో 6 అంకెలు

కొన్ని దేశాల్లో ఏటీఎం పిన్ కోసం 6 అంకెల నెంబర్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఇండియాలో కూడా కొన్ని బ్యాంకులు 6 అంకెల పిన్ నెంబర్లతో ఏటీఎం కార్డులను జారీ చేస్తున్నాయి. 4 అంకెలతో పోలిస్తే 6 అంకెల ఏటీఎం పిన్ సురక్షితం. సులువుగా ఎవరూ గుర్తుపెట్టుకోలేరు. కానీ 4 అంకెల గల పిన్ అయితే ఉపయోగించడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా నెంబర్లను సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు.