నిత్యం ఆఫీసుకు వెళ్లి సహోద్యోగులతో కలిసి పనిచేయడం, డ్యూటీ సమయం ముగిసిన తర్వాత ఇంటికి రావడం అందరికీ తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి సమయంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇంటి నుంచే పనిచేసే విధానం వచ్చింది. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత కూడా ఆ పద్ధతి కొనసాగింది. అయితే ఇప్పుడు పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆఫీసులకు రమ్మని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కానీ దీనికి ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. తప్పించుకోవడానికి అనేక సాకులు చెబుతున్నారు. దీనికి అమెజాన్ సంస్థ ఉద్యోగులు కూడా అతీతంగ కాదు
అమెజాన్ సంస్థ లో హబ్రిడ్ వర్క్ పాలసీ రద్దయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు 2025 జనవరి నుంచి వారానికి ఐదు రోజుల పాటు ఆఫీసుకు రావాలని ఆ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ తమ సిబ్బందికి ఈ మెయిల్స్ పంపారు. అలాగే కార్యాయంలో కూర్చుని కలిసి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించారు. దాని వల్ల ప్రతి ఒక్కరిలో పరస్పర సహకారం పెరుగుతుందని, ఉత్సాహ వంతమైన ఆలోచనలతో చురుగ్గా ఉంటారని తెలిపారు. అందరూ ఒకేచోట కలిసి ఉండడం వల్ల స్నేహభావం పెరుగుతుందన్నారు. అయితే కార్యాలయాలకు తిరిగి రావడానికి చాలా మంది సిబ్బంది ఆసక్తి కనబర్చడం లేదు. ఈ విషయంపై పునరాలోచించాలని కంపెనీని వేడుకుంటున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకు వేసి మాయమాటలు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..