భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అత్యధునిక టెక్నాలజీతో హై స్పీడ్‌తో కూడిన రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల నుంచి వందేభారత్ రైళ్లు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక మీరట్ నుండి లక్నో, మధురై నుండి బెంగళూరు, చెన్నై నుండి నాగర్‌కోయిల్ వరకు మూడు కొత్త వందే భారత్ రైళ్లను ఆగస్టు 31 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం, వేగవంతమైన వృద్ధిని ప్రోత్సహించడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడం చాలా ముఖ్యమైనదని అన్నారు.
ఇది కూడా చదవండి: Reliance Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటన..100GBలు ఉచితం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన మోదీ భారతదేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యతను చెప్పారు. తమిళనాడు, కర్ణాటకలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెరగడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో రైలు రవాణా పటిష్టమైందన్నారు. కొత్త మీరట్ సిటీ-లక్నో వందే భారత్ రైలు రెండు నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే ప్రయాణికులకు ఒక గంట ఆదా చేస్తుంది. ఇదిలా ఉంటే, చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందే భారత్ రైలు రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఆదా చేస్తుంది. అదే సమయంలో బెంగళూరు వందే భారత్ రైలులో ప్రయాణ సమయం సుమారు 1.30 గంటలు తగ్గుతుంది. అయితే ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదు. ముందుగా నిర్ణయించిన మాదిరిగానే ఈ రైలు ఛార్జీలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బెస్ట్ ఆఫర్.. రూ.197 ప్లాన్‌తో 70 రోజులు.. బెనిఫిట్స్ ఇవే..!
రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత భారతీయ రైల్వేలో ప్రయాణీకులందరికీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి తన ప్రభుత్వ నిబద్ధతను మోదీ పునరుద్ఘాటించారు. రైల్వే నెట్‌వర్క్‌ను ఆధునీకరించడంపై మోడీ మాట్లాడారు. పేద, మధ్యతరగతి, ఇతరులందరికీ రైల్వే సౌకర్యం కల్పించే వరకు ఈ మిషన్ కొనసాగుతుందని చెప్పారు. వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన తర్వాత చోటుచేసుకుంటున్న మార్పులపై మోదీ ఉద్ఘాటించారు. భారత రైల్వే వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఈరోజు మీరట్-లక్నో మార్గంలో వందే భారత్ రైలు ద్వారా యూపీ, ముఖ్యంగా పశ్చిమ యూపీ ప్రజలకు శుభవార్త లభించిందని ఆయన అన్నారు.
మీరట్, పశ్చిమ యూపీలు విప్లవభూమి అని అన్నారు. నేడు ఈ ప్రాంతం అభివృద్ధిలో కొత్త విప్లవానికి సాక్షిగా నిలుస్తోందని, నగరంలో ప్రతి రూట్‌లో వందే భారత్‌కు డిమాండ్ ఉందని, హై-స్పీడ్ రైళ్ల ఆగమనం ప్రజలు తమ వ్యాపారాలు, ఉపాధి, వారి కలలను విస్తరించుకునే విశ్వాసాన్ని ఇస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైల్వే సర్వీసులు నడుస్తున్నాయని మోడీ పేర్కొన్నారు.
రైల్వే లైన్ల విద్యుదీకరణ, కొత్త రైళ్ల నడపడం, కొత్త మార్గాల నిర్మాణం వంటి అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. భారతీయ రైల్వేలను అనుసంధానం చేస్తున్నామని అన్నారు.
అతి త్వరలో వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్ కూడా రాబోతోందని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం నమో భారత్ రైలును పెద్ద నగరాల్లో నడుపుతున్నారు అలాగే నగరాల్లో ట్రాఫిక్ సమస్య నుండి బయటపడటానికి వందే మెట్రోను కూడా నడుపుతున్నారమని అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌కు సంబంధించిన పురోగతిని కూడా మోదీ వివరించారు. ప్రయాణ సౌకర్యాలను పెంచేందుకు 1300లకు పైగా రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. దీంతో స్టేషన్లు కూడా మెరుగుపడుతున్నాయని, నగరాలకు కొత్త గుర్తింపు లభిస్తోందని అన్నారు. నేడు దేశంలో విమానాశ్రయాల మాదిరిగానే చాలా చోట్ల రైల్వే స్టేషన్లు నిర్మాణం అవుతున్నాయని తెలిపారు.
In a significant boost to rail travel, three new Vande Bharat trains are being flagged off. These will improve connectivity across various cities of Uttar Pradesh, Karnataka and Tamil Nadu.https://t.co/td9b8ZcAHC
— Narendra Modi (@narendramodi) August 31, 2024
ఇది కూడా చదవండి: New Rules: సెప్టెంబర్ నుంచి మారనున్న కీలక మార్పులు ఇవే.. కొత్త నిబంధనలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి