Good News: అన్నదాతలకి శుభవార్త.. వాటి వినియోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కేంద్రం..!

|

Apr 19, 2022 | 6:07 PM

Good News: దేశంలోని రైతులు ఇప్పుడు వ్యవసాయంలో డ్రోన్‌లను ఉపయోగించగలరు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Good News: అన్నదాతలకి శుభవార్త.. వాటి వినియోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కేంద్రం..!
Drones
Follow us on

Good News: దేశంలోని రైతులు ఇప్పుడు వ్యవసాయంలో డ్రోన్‌లను ఉపయోగించగలరు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయంలో రెండేళ్లపాటు డ్రోన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం మధ్యంతర ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ సమయం 18 ఏప్రిల్ 2022 నుంచి లెక్కిస్తారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్‌లో వ్యవసాయంలో డ్రోన్‌ని ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్ 18న దీని వినియోగానికి ఆమోదం తెలిపింది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి కేంద్రం మధ్యంతర ఆమోదం ఇవ్వడంతో పాటు దాని వినియోగానికి సంబంధించి SOP (standard operating procedures) కూడా జారీ చేసింది. సమాచారం ప్రకారం.. రైతులు ఇప్పుడు పొలాల్లో పురుగుమందులను పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించగలరు. అందరితో చర్చించిన తర్వాతే డ్రోన్ ఆపరేషన్‌కు సంబంధించి SOP తీసుకువచ్చినట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తెలిపింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. డ్రోన్‌లను ఉపయోగించి పురుగుమందుల పిచికారీ చేయడం వల్ల పంటలని కాపాడటమే కాకుండా తక్కువ జీవన వ్యయంతో రైతుల ఆదాయాన్ని కూడా పెంచవచ్చని చెబుతోంది.

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి ఆమోదం లభించిన తర్వాత ఇప్పుడు కస్టమ్ హైరింగ్ సెంటర్ (CHC)లోకి డ్రోన్ చేరినట్లయింది. ప్రాథమికంగా సిహెచ్‌సిలలో అన్ని వ్యవసాయ పరికరాలు చాలా తక్కువ ధరకి రైతులకి అద్దెకి ఇస్తారు. ఈ CHCలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి. వీటిని కిసాన్ సమితి నిర్వహిస్తుంది. ఈ కేంద్రాల్లో వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుంది. ఇక్కడి నుంచి రైతులు తమ సౌకర్యాన్ని బట్టి పరికరాలను తీసుకెళ్లవచ్చు. దీని కోసం వారు నామమాత్రపు అద్దె చెల్లించాలి. ఈ ఆమోదం తర్వాత డ్రోన్ కూడా సీహెచ్‌సీలోకి చేరనుంది.

Health Tips: ఉడకబెట్టిన శెనగలతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Cardamom Benefits: యాలకులలో అద్భుత ఔషధ గుణాలు.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Health Tips: ఈ ఆహారాలతో ఆయుష్షు పెంచుకోవచ్చు.. ఈ డైట్‌ మెయింటెన్‌ చేస్తే సాధ్యమే..!