మోటో సోల్ ప్రదర్శనలో టీవీఎస్ కంపెనీ ఇంజిన్ ప్రత్యేకంగా నిలిచింది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపించారు. తమిళనాడులోని హోసూరులో దీన్ని రూపొందించారు. అయితే ఈ ఇంజిన్ ను ఏ వాహనానికి ఉపయోగిస్తారో టీవీఎస్ కంపెనీ తెలపలేదు. దీంతో ఆ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ఇంజిన్ లో లిక్విడ్ కూల్డ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. డ్యూయల్ ఓవర్ హెడ్ కెమెరాలలో నాలుగు వాల్వులను అమర్చారు. దీనిలో ఆటోమెటిక్ ప్లాస్మా – కోటెడ్ సిలిండర్ ను ఉపయోగించారు. సిలిండర్ లోపల ఘర్షణను తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డ్యూయల్ ఆయిల్ పంప్, స్ల్పిట్ చాంబర్ క్రాంక్ కేస్, వాటర్ జాకెట్ తో కూడిన డ్యూయల్ కూలింగ్ జాకెట్ సిలిండర్ హెడ్, డ్యూయల్ బ్రీటర్ సిస్టమ్ దీని ప్రత్యేకతలు. అలాగే ఇంజిన్ థొరెటల్ బై వైర్ పొందుతుందని కంపెనీ వివరించింది.
ఇంజిన్ ప్రత్యేకతల విషయానికి వస్తే 9000 ఆర్పీఎం వద్ద 34.5 బీహెచ్పీ, 7000 ఆర్పీఎం వద్ద 28.5 ఎన్ఎం గరిష్ట టార్కు విడుదల అవుతుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో పనిచేసే ఆరు స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను జత చేశారు. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన టీవీఎస్ కంపెనీకి దేశంలో మంచి ఆదరణ ఉంది. మెరుగైన నాణ్యత, మంచి పనితీరుతో ఈ కంపెనీలు వాహనాలు ప్రజలందరికీ దగ్గరయ్యాయి. అన్ని వర్గాల వారికీ అనువైన విధంగా వివిధ మోడళ్ల వాహనాలు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. టీవీఎస్ ఆర్ టీఎక్స్ డీ 4 300 ఇంజిన్ లో మెరుగైన టెక్నాలజీని ఉపయోగించారు. ప్రస్తుతమున్న 312 సీసీ ఇంజిన్ కంటే ఇది ఆధునికంగా ఉంటుంది. ఇంజిన్ మరింత సమర్థంగా పనిచేయడానికి, వేగంగా పుంజుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్టు ఉన్నాయి.
ఇప్పటికే ఉన్న 312 సీసీ కంటే తక్కువ బరువు ఉండడం వల్ల ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. కొత్త ఇంజిన్ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని టీవీఎస్ వెల్లడించలేదు. కానీ ఇప్పటికే కొత్త పేరును ట్రేడ్ మార్కు చేసింది. అలాగే ఏ మోడల్ వాహనంలో ఈ ఇంజిన్ వినియోగిస్తుందో కూడా స్పష్టంగా తెలియదు. అపాచీ ఆర్ టీఎక్స్ లో కొత్త ఇంజిన్ ను వినియోగించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బహూశా 2025 మధ్యలో ఈ ఇంజిన్ వాహనం మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టీవీఎస్ 300 సీసీ పోర్టుపోలియోలో ఆర్టీఆర్ 310 స్ట్రీట్ ఫైటర్, ఫుల్ ఫెయిర్డ్ అపాచీ ఆర్ఆర్ 310 అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి