Tesla Cybertruck: టెస్లా సైబర్‌ ట్రక్‌తో వారికి ప్రమాదం! హెచ్చరించిన భద్రతా నిపుణులు..

| Edited By: Ravi Kiran

Dec 14, 2023 | 12:30 PM

ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇటీవల సైబర్‌ట్రక్‌ అనే బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును ఆవిష్కరించింది. ఎలాన్‌ మస్క్‌ ఎంతో అట్టహాసంగా దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. కొన్నేళ్ల క్రితమే దీనిని తీసుకొచ్చినా.. కొన్ని లోపాలతో మళ్లీ వెనక్కి వెళ్లి.. తిరిగి మరింత అత్యాధునికంగా, ధృడంగా తయారై వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే అత్యంత ధృడమైన స్టీల్‌తో దీనిని తయారు చేయడం, దీని రూపు, ఎక్స్ టీరియర్ డిజైన్ వంటివి రోడ్డుపై ప్రమాద తీవ్రతను పెంచగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tesla Cybertruck: టెస్లా సైబర్‌ ట్రక్‌తో వారికి ప్రమాదం! హెచ్చరించిన భద్రతా నిపుణులు..
Tesla Cybertruck
Follow us on

ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇటీవల సైబర్‌ట్రక్‌ అనే బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును ఆవిష్కరించింది. ఎలాన్‌ మస్క్‌ ఎంతో అట్టహాసంగా దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. కొన్నేళ్ల క్రితమే దీనిని తీసుకొచ్చినా.. కొన్ని లోపాలతో మళ్లీ వెనక్కి వెళ్లి.. తిరిగి మరింత అత్యాధునికంగా, ధృడంగా తయారై వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే అత్యంత ధృడమైన స్టీల్‌తో దీనిని తయారు చేయడం, దీని రూపు, ఎక్స్ టీరియర్ డిజైన్ వంటివి రోడ్డుపై ప్రమాద తీవ్రతను పెంచగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రహదారులపై నడిచే పాదచారులు, సైక్లిస్టులకు ఇది ప్రమాదకరం కాగలదని చెబుతున్నారు. అదేంటి ఇంత గట్టిగా ఈ విషయాన్ని వారు ఎలా చెప్పగలుగుతున్నారు? టెస్లా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆందోళన ఎందుకంటే..

టెస్లా సైబర్‌ట్రక్ కోణీయ డిజైన్‌ను కలిగి ఉంది.అంతేకాక దీని బాడీ ధృడంగా ఉండేందుకు గట్టి స్టెయిన్‌లెస్-స్టీల్ ను వినియోగించారు. దీని వల్ల ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా పాదచారులు, సైక్లిస్ట్‌లకు హాని కలిగిస్తుందని, అలాగే రోడ్లపై ఇతర వాహనాలను దారుణంగా దెబ్బతీస్తుందని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ 30న జరిగిన ఈవెంట్‌లో టెస్లా ప్రత్యక్ష ప్రసారం చేసిన క్రాష్ టెస్ట్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమయ్యాయి. వీటిని వీక్షించిన ఆరుగురు భద్రతా ప్రొఫెసర్లు, అధికారులు ఇది ప్రమాదకరంగా ఉందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే దీనిని కచ్చితంగా నిర్ధారించేందుకు పూర్తి క్రాష్‌ టెస్ట్‌ డేటా అవసరమని రాయిటర్స్‌ వార్తా సంస్థతో వారు చెప్పారు. వాస్తవానికి వారు చెప్పిన ఆందోళనకర అంశం ఏమిటంటే టెస్లా సైబర్‌ ట్రక్‌ను చాలా మందపాటి స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగించి ధృడంగా తయారు చేశారు. అలాంటప్పుడు ఏదైనా క్రాష్‌ జరిగినప్పుడు అవతలి వారు ఎగిరి ఈ ట్రక్‌ పై పడ్డా.. లేదా గుద్దుకున్నా వారి తలలు తగిలినా భారీ నష్టం చూడాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మస్క్‌ ఏమంటారంటే..

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో మాట్లాడుతూ ఇతర ట్రక్కులతో పోల్చితే సైబర్‌ట్రక్ చాలా భద్రతా ప్రమాణాలను పాటిస్తుందన్నారు. ముఖ్యంగా పాదచారులకు, ప్రయాణికులకు, సైక్లిస్టులకు ఎటువంటి హాని కలుగదని చెప్పుకొచ్చారు. ఇది ఫ్లాట్ ప్లేన్‌లు, పొడవైన, సరళ అంచులతో రూపొందించబడిందని చెప్పారు. 1985 చలనచిత్రం “బ్యాక్ టు ది ఫ్యూచర్”లో ప్రదర్శించబడిన డెలోరియన్ కారు తర్వాత స్టెయిన్‌లెస్-స్టీల్ ఎక్స్‌టీరియర్‌తో వస్తున్న మొట్టమొదటి కారు ఇదేనని మస్క్‌ వివరించారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని ఫ్యాక్టరీలో లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఇదే విషయాన్ని స్పష్టం చేశామన్నారు. టెస్లా కోల్డ్ రోల్డ్, స్టెయిన్‌లెస్ బాడీ ప్యానెల్‌లు క్రాష్ సమయంలో ప్రభావాన్ని గ్రహించేలా రూపొందించామని వివరించారు. కారు ముందు వెనుక నిర్మాణాలు క్రాష్‌ సమయంలో సక్రమంగా ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. కాగా షేర్‌ మార్కెట్లో టెస్లా షేర్లు దూసుకెళ్తున్నాయి. నిపుణులు భద్రతా పరమైన అంశాలు లేవనెత్తినప్పటికీ ఆ ప్రభావం మార్కెట్‌పై పడకపోవడం గమనార్హం. 2025 సంవత్సరానికి దాదాపు 250,000 సైబర్‌ట్రక్కుల ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని ఎలాన్‌ మస్క్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..