Tenancy Laws: అద్దెదారు ఇంటిని ఖాళీ చేయకపోతే ఏం చేయాలి..? చట్టాలు ఏం చెబుతున్నాయి?

|

Dec 02, 2022 | 5:28 PM

భారతదేశంలోఅద్దె చెల్లించనందుకు అద్దెదారుని తొలగించడం, ఇంటి యజమాని పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ అద్దెకు ఉంటున్న వ్యక్తి ఇంటిని ఖాళీ చేయకపోవడం వంటి అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి..

Tenancy Laws: అద్దెదారు ఇంటిని ఖాళీ చేయకపోతే ఏం చేయాలి..? చట్టాలు ఏం చెబుతున్నాయి?
Tenancy Laws
Follow us on

భారతదేశంలోఅద్దె చెల్లించనందుకు అద్దెదారుని తొలగించడం, ఇంటి యజమాని పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ అద్దెకు ఉంటున్న వ్యక్తి ఇంటిని ఖాళీ చేయకపోవడం వంటి అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. ఈ వివాదాలను పరిష్కరించడానికి ఇంటి యజమాని అద్దెదారులకు సంబంధించి హక్కులను పరిరక్షించే కొన్ని చట్టాలను ప్రభుత్వం చేసింది. దీనితో పాటు ఈ చట్టం అద్దెదారుని అనవసరమైన అద్దె చెల్లించకుండా కూడా రక్షిస్తుంది. భూస్వాములు, అద్దెదారుల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి, రక్షించడానికి 1948 సంవత్సరంలో అద్దె నియంత్రణ చట్టం ఆమోదించబడింది. మహారాష్ట్ర అద్దె నియంత్రణ చట్టం 1999 ఢిల్లీ అద్దె నియంత్రణ చట్టం1958 వంటి ప్రతి రాష్ట్రానికి దాని స్వంత అద్దె నియంత్రణ చట్టం ఉంది. అయితే కొన్ని నియమాలు అన్ని రాష్ట్రాల్లో సాధారణంగా ఉంటాయి.

అద్దెదారు గదిని ఖాళీ చేయకపోతే ఏమి చేయాలి?

నిబంధనల ప్రకారం.. ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తులు సరిగ్గా అద్దె చెల్లించకుండా ఉంటే ఇంటి యజమాని ఇంటికి ఖాళీ చేయాలని అభ్యర్థిస్తుంటాడు. అలాంటి సమయంలో ఇంటి యజమాని అభ్యర్థన తర్వాత ఇంటిని ఖాళీ చేయకపోతే అటువంటి అద్దెదారు ఇంటి యజమానికి అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. మరో వైపు అద్దె ఒప్పందం గడువు ముగిసి అది పునరుద్ధరించబడకపోతే పెరిగిన అద్దెను అద్దెదారు చెల్లించాల్సి ఉంటుంది. అద్దెదారు మొదటి రెండు నెలలకు రెండింతలు, ఆ తర్వాత 4 రెట్ల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. అయితే అతను ఈలోగా కాంట్రాక్టును పునరుద్ధరించినట్లయితే అతను అదనపు అద్దెను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

అలాగే అద్దెకు ఉంటున్న వ్యక్తి లేదా అతని కుటుంబానికి ఏదైనా ఊహించని సంఘటన జరిగితే అటువంటి పరిస్థితిలో యజమాని ఆ సంఘటన ముగిసిన తేదీ నుండి ఒక నెల వ్యవధిలో అద్దెదారున్ని ఉండటానికి అనుమతిస్తారు. అదే సమయంలో అతను కోరుకుంటే అతను అద్దెను కూడా మాఫీ చేయవచ్చు. ఆ మాఫీ అనేది ఇంటి యజమానిపై ఆధారపడి ఉంటుంది. అద్దెకు ఉంటున్న వ్యక్తి, ఇంటి యజమాని మధ్య రాత పూర్వక పత్రం ఉండటం తప్పనిసరి. అద్దెకు ఇవ్వడంపై ఇంటి యజమాని అతనితో రాతపూర్వకంగా పత్రం రాయించుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పత్రం లేకపోతే అతను అద్దె చెల్లించకపోతే అతనిపై దావా వేసే హక్కు కోల్పోతాడని నిబంధనలు చెబుతున్నాయి. అద్దె ఇచ్చే సమయంలో ఇద్దరి మధ్య రాతపూర్వకంగా ఒప్పందం ఉండటం తప్పనిసరి న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి